బాబుకి కామన్ సెన్స్ లేదా ?

Vangaveeti Radha says Chandrababu have No common sense

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

అత్త మీద కోపం దుత్త మీద చూపించడమంటే ఎలా ఉంటుందో వంగవీటి రాధాని చూస్తే అర్ధం అవుతుంది. రంగ మీద ఓ వైసీపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు నానా రచ్చ అయితే ఆ విషయాన్ని వదిలిపెట్టి లోటస్ పాండ్ సూచనల మేరకు సీఎం చంద్రబాబుని టార్గెట్ చేస్తూ ప్రెస్ ముందుకు వచ్చారు. సీఎం కి కామన్ సెన్స్ లేదని అన్నారు. దీంతో పాటు రాధా చేసిన కామెంట్స్ ఏమిటో కాస్త చూడండి.

  • చంద్రబాబు సిఎం స్థాయికి తగ్గట్టు హుందాగా వుండాలి.
  • మా పార్టీలో ఎవరు తప్పు చేసినా వెంటనే చర్యలు తీసుకుంటారు.
  • మీ పార్డీలో సిఎంనే జెసి దివాకర్ రెడ్డి విమర్శించినా పట్టించుకోని పరిస్థితి.
  • విజయవాడలో రంగాపై వ్యాఖ్యల నేపథ్యంలో ఏం జరిగిందో తెలుసుకోకుండా చంద్రబాబు మాట్లాడారు.
  • చంద్రబాబు కు కనీస కామన్ సెన్స్ లేదు.
  • ఓ మాజీ శాసనసభ్యురాలిని రోడ్డుపై పోలీసులు ఈడ్చుకుంటూ వెళ్ళారు.
  • దీనికి సంబంధించిన అధికారుల తీరుపై సిఎం కనీసం స్పందించకపోవడం దారుణం.
  • లా అండ్ ఆర్డర్ పై సిఎంకు పట్టులేదు.
  • చిత్తశుద్ధి వుండే ఈ ఘటనలో పోలీసుల వ్యవహార శైలిపై విచారణ జరపాలి.
  • దీనిపై న్యాయపోరాటం చేస్తాం.
  • అనుచితంగా వ్యవహరించిన పోలీసుల పై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయబోతున్నాం.
  • రంగా అభిమానులు సంయమనం పాటించాలని కోరేందుకే ప్రెస్ మీట్ పెట్టాలని భావించాం.
  • పోలీసులు ఎవరి ఆదేశాలతో మమ్మల్ని అడ్డుకున్నారో తెలియదు.
  • వైఎస్ఆర్ సిపి లో పూర్తి క్రమశిక్షణ వుంది.
  • వంగవీటి రంగాపై మాట్లాడిన వారిని వెంటనే సస్పెండ్ చేశారు.
  • తెలుగుదేశం పార్టీలో అధిష్టానం ను విమర్శించినా ఎటువంటి చర్యలు తీసుకోలేని పరిస్థితి మీది.
  • అటువంటి చంద్రబాబు మమ్మల్ని విమర్శించడం హాస్యాస్పదం

: వంగవీటి రాధాకృష్ణ

మరిన్ని వార్తలు:

లోకేష్ కి సైకాలజిస్ట్ అవసరం… జగన్ ఎప్పుడు నేర్చుకుంటాడో ?

ఎవరో రావాలి, ఏదో చేయాలి… జగన్ ఎదురుచూపులు.

డైలాగ్ కింగ్ కి జగన్ ఫుల్ క్లాస్.