తెలంగాణలోని వరంగల్ రూరల్ జిల్లాలో 9మంది వలస కార్మికులు మృతి తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. అయితే గొర్రెకుంట పరిశ్రమ పరిధిలో చోటుచేసుకున్న ఈ విషాదం చర్చనీయాంశంగా మారింది. అయితే ఇప్పుడు అందరి దృష్టీ అసలు వలస కార్మికుల మరణాలకు కారణం ఏంటి? ఎవరైనా హత్య చేశారా? లేకా ఏదైనా ఇబ్బందులతో సామూహికంగా ఆత్మహత్య చేసుకున్నారా? ఆత్మహత్యే అయితే ఒకే కుటుంబానికి చెందినా ఆరుగురు, మరో ఇద్దరు బీహార్ వాసులు, ఒక త్రిపుర వాసి కూడా ఎందుకు వారితో కలిసి ఆత్మహత్య చేసుకుంటారు. అనేవి అందరి మెదళ్లను తొలిచి వేస్తోన్న ప్రశ్నలు.
ఇలాంటి సమయంలో తినటానికి, ఉండటానికి ఇబ్బంది ఏమైనా ఉందా? అంటే అలాంటివేం లేదనేది తెలుస్తోంది. మరైతే మృతికి కారణాలు ఏంటి ? అసలేం జరిగింది? అన్నది ఇప్పుడు పోలీసులకు సవాల్ గా మారింది. ఇది హత్యే అనే అనే కోణంలో చాలా తీవ్రమైన అనుమానాలకు దారితీస్తున్నాయి.
ఇది హత్యేగాని అయితే ఇంతమందిని ఎవరు చంపారు. రెక్కాడితే కాని డొక్కాడని వారి వద్ద నుంచి దేనికోసం ఈ హత్యలు చేశారు? లేదా ఇది ఆత్మహత్యలే అనుకుంటే ఒకేసారి అంతమంది బలవన్మరణాలకు పాల్పడటం ఎలా సాధ్యం ? అన్న కోణంలో కూడా విచారణ జరుగుతోంది. అయితే వీటిపై అన్నికోణాల్లోనూ లోతైన అధ్యయనం చేసి కేసును ఛేదిస్తామని ధీమా వ్యక్తం చేస్తన్నారు పోలీసులు. వారిలో కొంతమందివి ఒకసారి మరికొంతమందివి ఒకసారి ఫోన్లు స్విచ్ ఆగిపోవడం విశేషం. అయితే ఇక్కడ ఈ కేసులో మరో ట్విస్ట్ ఏమిటంటే… భర్తతో విడిపోయిన మక్సూద్ కూతురు బుస్రా నగరంలోని ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ వ్యవహారంలో బుస్రాకు తన తల్లితో గొడవలు జరుగుతున్నట్లు కూడా తెలుస్తోంది. ఇంటిపై ఉంటున్న బీహార్‌కు చెందిన వారు శ్రీరాం, శ్యామ్‌లు వీరి గొడవలో జోక్యం చేసుకున్నట్టుగా సమాచారం. అంతే కాదు వీరు బుస్రాపై కన్నేసినట్లు కూడా తెలుస్తుంది. ఈ విషయం తెలుసుకున్న బుస్రా ప్రియుడు వారితో చనిపోవటానికి ముందు రోజు మక్సూద్ ఇంట్లో బర్త్ డే విందుకు హాజరైనట్లుగా వెల్లడిస్తున్నారు.
ఈ విందులో జరిగిన ఘర్షణతో బీహార్ యువకులు మక్సూద్ కుటుంబాన్ని చంపి బావిలో పడేసి ఇక హత్యలు చేశామన్న భయంతో వారు ఆత్మహత్యకు పాల్పడి ఉంటారా? అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. కాగా అందరికంటే చివరగా మక్సూద్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. అంటే మక్సూద్ అప్పటివరకు ఏం చేశాడు అన్న కోణంలో కూడా దర్యాప్తు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇక మక్సూద్ నివాసం ఉన్న గదులను తనిఖీ చేసినప్పుడు అతడి జేబులో కండోమ్ ప్యాకెట్ దొరికింది. మరి పెళ్లయ్యి ముగ్గురు పిల్లలున్న అతడి దగ్గర కండోమ్ ఉండటం ఏంటి..? అందరి సెల్ఫోన్లు సాయంత్రమే స్విచ్ఛాఫ్ అయినా మక్సూద్ ఫోన్ రాత్రి వరకు ఆన్‌లో ఉండటం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. ఏది ఏమైనప్పటికీ.. పోలీసులకు సవాల్ గా మారిన ఈ కేసులో ఫోన్ కాల్స్ ఆధారంగా కొంతవరకు.. పోస్ట్ మార్టం నివేదిక ద్వారా కొంతవరకు నిజాలు వెలువడే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది.