షాకింగ్ న్యూస్: ఈ లెక్కన జూన్ చివరికి 20 లక్షల కరోనా కేసులా??

కృష్ణ జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 177 కరోనా పాజిటివ్ కేసులు

కరోనా కేసులు భారత్ లో మొదట చాలా తక్కువ నమోదు అయ్యాయి. లాక్‌డౌన్ విధించడం..  ఆ తర్వాత ఇచ్చిన సడలింపులు అన్ని చేసినా గానీ.. భారత్‌లో కరోనా వైరస్ విజృంభణ తగ్గడం లేదు. ఇదే సమయంలో సీసీఎంబీ తీవ్రంగా హెచ్చరించింది. జూన్ నెల చివరి నాటికి భారత్‌లో కరోనా కేసుల సంఖ్య 10 నుంచి 20 లక్షలకు చేరే అవకాశం ఉందని వార్నింగ్ ఇచ్చింది సీసీఎంబీ. వలస కార్మికులు సొంత ఊళ్లకు తిరిగి వెళ్తుండడంతో వైరస్ పట్టణాల నుంచి పల్లెలకు విస్తరిస్తోందని షాకింగ్ నిజాలు వెల్లడించింది.

అయితే లాక్‌డౌన్‌ సడలింపులతో త్వరలో కరోనా కేసుల విస్ఫోటనం ఉండే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు సీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా. తాజాగా ఓ మీడియా సంస్థతో మాట్లాడిన ఆయన ప్రస్తుతం చేస్తున్న పరీక్షలు తక్కువ కనుక తక్కువ కేసులు నమోదవుతున్నాయనని.. ముందు ముందు కేసుల సంఖ్య ఇప్పటికి పదింతలు ఎక్కువ నమోదయ్యే అవకాశం ఉందని స్పష్టం చేశారు. అలాగే… వైరస్‌ పరిసరాలు, వస్తువుల ద్వారా కంటే వ్యక్తుల నుంచి వ్యక్తులకే వేగంగా వ్యాపిస్తుందని తెలిపారు. అమెరికాలోని ప్రతిష్టాత్మక సంస్థ సెంటర్‌ ఫర్ డిసీజ్‌ కంట్రోల్‌ తాజా అధ్యయనం ఇదే విషయాన్ని చెప్పిందని ఆయన స్పష్టం చేశారు.