ఏపీ ఆర్థిక పరిస్థితి 11..తెలంగాణ 4 స్థానాలలో ఉన్నాయి – యనమల

Yanamala
Yanamala

ఏపీ ఆర్ధికస్థితి 8వ స్థానం నుంచి 11 వస్థానంకు దిగజారిందని డాయిష్ బ్యాంకు సర్వేలో వెల్లడైంది. దీనికి కారకులెవరు? తెలంగాణ కంటే ఏపీ 7 స్థానాలు ఎందుకు పడిపోయింది? అని ఫైర్‌ అయ్యారు టీడీపీ పొలిటి బ్యూరో సభ్యుడు యనమల. ఇదీ అసమర్ధత కాదా? ఏపీ ఆర్ధికస్థితి ఏడాదికేడాదికి దిగజారుతోందని చెప్పినా జగన్ పెడచెవున పెట్టారని మండిపడ్డారు. క్లాసిక్ డెట్ ట్రాప్‌లోకి ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రం వెళుతోందని గత నాలుగేళ్లుగా ఏకరవు పెడుతున్నా దిద్దుబాటు చర్యలు తీసుకోలేదని ఆగ్రహించారు.

వాస్తవ ఆర్ధిక పరిస్థితిని ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాద్ రెడ్డి విశ్లేషించకుండా పదేపదే అబద్దాలను వల్లె వేస్తున్నారని…తెలంగాణ ఆర్ధిక స్థితి ఎంతో మెరుగ్గా 4వ స్థానానికి వృద్ధి చెందడం, మన కంటే వనరులు తక్కువ ఉన్న ,జగన్ రెడ్డి రాష్ట్రం వెనకబడతానికి చేతగానితనం కాదా? అంటూ మండిపడ్డారు టీడీపీ పొలిటి బ్యూరో సభ్యుడు యనమల. నిన్నటి వరకు విద్యుత్ వినియోగదారులపై రూ.57 వేల కోట్ల భారాలు వేసి ఇష్టానుసారం దోచుకున్న జగన్ రెడ్డి నేడు విద్యుత్ ఉద్యోగుల నిధులపై పడ్డాడు…మద్యం బాండ్లతో రూ.16 వేల కోట్లు అప్పులు తెచ్చిన జగన్ రెడ్డి నేడు మరో కొన్ని కోట్లు అప్పులు తెచ్చేందుకు బాండ్ల వేలానికి వెళుతున్నాడని ఫైర్‌ అయ్యారు.

మద్యం బాండ్లలోకి విద్యుత్ ఉద్యోగుల పిఎఫ్, పెన్షన్ నిధులు మళ్లించే హక్కు మీకెవరిచ్చారు? నేడు రెవెన్యూ లోటు రూ.40 వేల కోట్లకు ఎందుకు పెరిగగా 2018 లో రూ.16 వేల కోట్లు ఉన్నదని టీడీపీ పొలిటి బ్యూరో సభ్యుడు యనమల అన్నారు .