దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. గురువారం 18వేలకుపైగా కేసులు నమోదుకాగా.. ఇవాళ కొత్త కేసులు కాస్త తగ్గి 17 వేలకు వచ్చాయి. మొత్తం 5.02 లక్షల మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 17,070 మందికి పాజిటివ్ వచ్చింది.. నిన్న ఒక్కరోజే 23 మంది మరణించారు. యాక్టివ్ కేసులు 1,07,189(0.25 శాతం)కి చేరగా.. నిన్న 14,413 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు.. రికవరీ రేటు 98.55 శాతంగా నమోదైంది.
ఇప్పటివరకూ 4.34 కోట్ల మందికి కరోనా సోకగా.. 4.28 కోట్ల మంది కోలుకున్నారు. 5.25 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు.ఈ కరోనా మహమ్మారి ముప్పు ఇంకా పోలేదని WHO హెచ్చరించింది. ఏకంగా 110 దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయని.. అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించింది. కరోనా మహమ్మారి మార్పు చెందుతోందని.. ఇంకా సమసిపోలేదని చెబుతోంది. భవిష్యత్ వేరియంట్ల గురించి విశ్లేషించడం కష్టంగా మారుతోందని.. సబ్ వేరియంట్ల కారణంగా కేసులు పెరుగుతున్నాయి అంటున్నారు.