నరేష్ పవిత్ర వ్యవహారం చాలా రోజులుగా టాలీవుడ్‌ను ఆక్రమిస్తోంది, అనే దానిపై సర్వత్రా చర్చలు జరుగుతున్నాయి. నరేష్ మరియు పవిత్ర గత కొన్ని నెలలుగా డేటింగ్ చేస్తున్నారు మరియు కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు లిప్ టు లిప్ వీడియోలో వారి సంబంధాన్ని ప్రకటించారు మరియు వారి ఇటీవలి వివాహానికి సంబంధించిన వీడియోను కూడా పోస్ట్ చేశారు.
అయితే వీళ్ళిద్దరి పెళ్లి నిజం కాదని కూడా ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు ఆ ప్రచారం నిజమైంది. నరేష్ పవిత్ర ముఖ్య పాత్ర లో ఓ బైలింగ్యువల్ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి `మళ్లీ పెళ్లి`అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈరోజు ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్, స్నీక్‌పీక్‌ని నిర్మాతలు విడుదల చేశారు. విజయనిర్మల స్థాపించిన విజయకృష్ణ మూవీస్ పతాకంపై నరేష్ స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ప్రముఖ దర్శకుడు ఎం.ఎస్.రాజు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో జయసుధ, శరత్ బాబు, అనన్య నాగ్రా తదితరులు నటించారు. వేసవి కానుకగా తెలుగు, కన్నడ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ‘మళ్లీ పెళ్లి’ తొలి పోస్టర్, వీడియోను వీకే నరేష్ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.
దీంతో నెటిజన్లు నరేష్, పవిత్ర లను ఏకేస్తున్నారు. ఛీ.. ఛీ.. డబ్బు కోసం ఇంతకు తెగించారా.. ఒక సినిమాను ప్రమోట్ చేసుకోవడం కోసం అంతలా దిగజారాలా.. అంటూ మండిపడుతున్నారు. మరికొందరు పెళ్లి ఫొటోలను ఎగతాళి చేస్తూ.. ‘‘అంకుల్.. చావు దెబ్బ కొట్టారు”, అంటూ కామెంట్స్ చేస్తున్నారు.