భారత ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ను డబ్ల్యూహెచ్‌వోలో కీలకమైన పదవి దక్కింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కార్యనిర్వాహక బోర్డు చైర్మన్‌గా ఈ నెల 22వ తేదీన బాధ్యతలు స్వీకరించనున్నారు హర్షవర్ధన్. అయితే ప్రస్తుతం జపాన్ ఆరోగ్య మంత్రి బోర్డు చైర్మన్‌గా ఉండగా.. 34 మంది సభ్యుల కార్యనిర్వాహక బోర్డు చైర్మన్‌గా భారత్‌కు అవకాశం ఇవ్వాలని గత ఏడాదే నిర్ణయం తీసుకున్నారు.
అయితే దీనిపై తాజాగా ప్రకటన వెలువడింది. మరో రెండు రోజుల్లో బాధ్యతలు స్వీకరించనున్నారు హర్షవర్ధన్. కాగా ఆయన మూడేళ్లపాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. ప్రపంచ ఆరోగ్యసంస్థ విధాన నిర్ణయాల్లో కీలకపాత్ర పోషించనున్నారు. కాగా అసలే ప్రపంచం మొత్తం కరోనాతో అతలాకుతలమౌతోన్న ఈ సమయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ వస్తుంది. ఈ కార్యనిర్వాహక బోర్డుకు కూడా కీలకమైన బాధ్యతలు ఉండడంతో.. ఇప్పుడు విధానపరమైన నిర్ణయాల్లో భారత్‌కు అవకాశం దక్కినట్లు సమాచారం అందుతుంది.