స్వతహాగ క్రైస్తవుడయిన జగన్మోహన్ రెడ్డి మతాలకు అతీతంగా హిందూ దేవాలయాలకు వెళ్తూ ఉండడం గురించిన విషయం మనకి తెలిసినదే. అలాగే 2016 ఆగష్టులో చాతుర్మాస దీక్ష సందర్భంగా హోమం చెయ్యడానికి రిషికేష్ వెళ్లారు. అయితే దానికి ప్రత్యేక హోదా కారణమైనా, ప్రత్యేకంగా విశాఖ శారదా పీఠాధిపతులు శ్రీ స్వరూపానంద స్వామి ఆధ్వర్యంలో ఆ హోమం జరగడం విశేషం. దీని ద్వారా, జగన్మోహన్ రెడ్డికి స్వరూపానంద స్వాములు వారితో మంచి అనుబంధమే ఉందన్నది మనకి వ్యక్తమవుతున్న విషయం. గతంలో జరిగిన ఈ హోమం, వాటికి సంబంధించిన పూజలు అన్నీ కూడా ఆయనే దగ్గరుండి చేయించడం, ఆయన పర్యవేక్షణలోనే జరగడమన్నది జగన్మోహన్ రెడ్డికి ఆయన ఆశీస్సులతో పాటు వారి మద్దతు కూడా లభిస్తుందని అభిప్రాయపడడంలో అతిశయోక్తి లేదు.
కాగా, ఈ జూలై 23వ తేదీన ప్రారంభం కాబోయే చాతుర్మాస దీక్ష నవంబర్ 19 వరకు ఉంటుంది. అయితే, 2019 ఎన్నికలు ముందు ఉన్న సమయాన హోమం చేయడానికి మళ్ళీ జగన్ వెళ్తాడా…! అయితే, జగన్ పాదయాత్రకు ముహూర్తం పెట్టింది ఆయనేనని స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పిన స్వరూపానంద స్వామి ఈ దీక్షకి కూడా తేదీ ఖరారు చేసి మళ్ళీ జగన్ చేత చాతుర్మాస దీక్షా హోమం చేయిస్తారా అన్నది పలువురిలో మెదులుతున్న సందేహం. అయితే, ఈ నాలుగు నెలలలో అది జరుగుతుందా లేదా అన్నది చూడాల్సిందే….