రూ.2 వేలు అప్పు తీర్చలేదని.. యువకుడు ప్రాణం బలి

Improper relationship with a sister is a brutal murder

ఆంద్రప్రదేశ్ లో ఈ లాక్ డౌన్ కరోనా కాలంలో ఘోరాలు జరుగుతున్నాయి. తాజాగా ప్రకాశం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. బావ, బావమరిది మధ్య రేగిన చిన్న వివాదం హత్యకు దారి తీసింది. అందుకు కారణం తెలిసి పోలీసులే షాక్ తిన్నారు.

అసలేం జరిగింది అంటే… పెద్దారవీడు మండలం చెంచుగిరిజన కాలనీకి చెందిన మండ్ల రాజయ్య, కుడుముల చెన్నయ్య వరుసకు బావ, బావమరిదులు అవుతారు. రాజయ్య తన బావమరిది చెన్నయ్య దగ్గర నుంచి  కొన్ని రోజుల క్రితం రూ.2 వేలు అప్పుగా తీసుకున్నాడు. ఈ క్రమంలో మళ్లీ డబ్బు తిరిగి చెల్లించమని రాజయ్యపై చెన్నయ్య ఒత్తిడి తీసుకొస్తున్నాడు. కానీ ఆయన కాస్త తాత్సారం చేస్తున్నాడు.

అయితే తన వద్ద తీసుకున్న అప్పును తిరిగి చెల్లించక పోవడంతో చెన్నయ్య బావ రాజయ్యపై గుర్రు మీద ఉన్నాడు. దీంతో తాజాగా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. కోపంతో ఊగిపోయిన చెన్నయ్య తన వద్ద ఉన్న బాణం వేయడంతో.. రాజయ్య శరీరంలో బలంగా దిగిపోయింది. దీంతో అతడు అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు విడిచాడు. కాగా చెన్నయ్య అక్కడి నుంచి పారిపోయాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మొత్తానికి రెండువేల రూపాయల గొడవ ప్రాణం తీసేసిందని అంతా షాక్ కి గురౌతున్నారు.