సిల్క్ స్మిత నిజ‌స్వ‌రూపం, ఎలాంటిదో తెలిస్తే షాకైపోతారు!

సిల్క్ స్మిత నిజ‌స్వ‌రూపం
సిల్క్ స్మిత నిజ‌స్వ‌రూపం

సిల్క్ స్మిత గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. అస‌లు పేరు విజయలక్ష్మి. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు దగ్గర లో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించింది. 4వ తరగతితో చదువుకు పులిస్టాప్ పడింది. 14 ఏళ్ల‌కే పెళ్లి పీట‌లెక్కింది.

చిన్నతనంలోనే భర్త, అత్తమామల వేధింపుల‌కు గురైన విజ‌య‌ల‌క్ష్మి.. ఓ రోజు అంద‌రికీ వ‌దిలేసి న‌ట‌న‌పై ఉన్న ఆసక్తితో చెన్నై రైలెక్కింది.చేతిలో నయా పైసా లేక‌పోయినా తన అందాన్ని, టాలెంట్‌ను నమ్ముకుని సిల్క్ స్మిత‌గా మారిపోయి చిత్రసీమలో అడుగు మోపింద.

వెండితెర మీద గ్లామర్ క్వీన్‌గా ఫేమ్ సొంతం చేసుకుంది. రొమాంటిక్ పాత్రలకు, ఐటెం సాంగ్స్ కు త‌న‌కు తానే సాటి అనిపించుకుంది. మత్తెక్కించే కళ్లతో కోట్లాది మందిని త‌న అభిమానులుగా మార్చుకుంది. తెలుగు, తమిళ, మళయాళ, కన్నడ చిత్రాలలో స్పెష‌ల్ సాంగ్స్, క్యారెక్టర్ రోల్స్, హీరోయిన్స్ ఇలా వందల సంఖ్యలో సినిమాలు చేసిన సిల్క్ స్మిత అర్ధాంతరంగా తన జీవితాన్ని ముగించింది.

1996 సెప్టెంబర్ 23న ఆమె తుదిశ్వాస విడిచి.. అంద‌రినీ శోక‌సంద్రంలోకి నెట్టేసింది. ఆమె చనిపోయి చాలాకాలం అవుతున్నా ఇంతవరకూ ఎవరూ మరిచిపోలేదు. అంత‌లా సిల్క్ ప్రేక్ష‌కుల గుండెల్లో గూడు క‌ట్టుకుంది. అయితే తాజాగా సిల్క్ స్మిత నిజ‌స్వ‌రూపం బయటపెట్టిన కాకినాడ శ్యామల. నటి, నిర్మాత, ఫైనాన్షియర్ అయిన కాకినాడ శ్యామ‌ల తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో సిల్క్ స్మిత ఎలాంటిడో వివ‌రించింది.

ఆమె వ్యక్తిత్వం చాలా గొప్పది.తెరపై ఆమె వేసే పాత్రలు, బయట మనకి కనిపించే స్మిత ఒకటి కాదు. ఆమె మంచి మనసున్న మనిషి.. నిజాయతీ ఉన్న మనిషి. ఓసారి ఆమె సొంత సినిమాకి నేను ఫైనాన్స్ చేశాను. ఆ సినిమా స‌రిగ్గా ఆడ‌క‌పోవ‌డంతో స్మిత అప్పులపాలైంది. కానీ, ఆమె ఎవరికీ డబ్బులు ఎగ్గొట్టలేదు. అందరికీ కూడా ఇవ్వవలసిన డబ్బులు ఇచ్చేసింది.

ఇక ఆమెను హత్య చేశారని కొంతమంది అంటారు. లేదు .. ఆత్మహత్య చేసుకుందని మరికొందరు అంటారు. నిజానికి ఏం జరిగింది అనేది ఆ పైవాడికి మాత్రమే తెలియాలి. అని కాకినాడ శ్యామ‌ల గారు చెప్పుకొచ్చారు.