Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కేంద్ర మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధమయింది. ఆదివారం ఉదయం జరగనున్న విస్తరణలో 12 మంది కొత్త వాళ్లకు చోటు దక్కనున్నట్టు సమాచారం. మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా కీలక శాఖల్లో మార్పులు చేర్పులు జరగనున్నాయి. మోడీ క్యాబినెట్ లో ప్రస్తుతం 73 మంది మంత్రులు ఉన్నారు. 81 మందితో మంత్రి మండలి ఏర్పాటుచేసుకునే అవకాశముంది. మూడేళ్ల కాలంలో మోడీ క్యాబినెట్ లో మొత్తం సంఖ్యలో మంత్రులు ఇప్పటిదాకా లేరు.
సార్వత్రిక ఎన్నికలకు ఇంకా రెండేళ్లే సమయముండటంతో గరిష్ట సంఖ్యలో మంత్రి పదవులను కేటాయిస్తారా లేదా అన్నది ఇంకా తేలలేదు. ఇప్పటికే ఖాళీగా ఉన్న శాఖలతోపాటు…ఏడుగురు మంత్రులు రాజీనామా చేసిన స్థానాల్లోనూ కొత్తవారినే తీసుకోవాలని ప్రధాని భావిస్తున్నారు దీంతో 12 మంది కొత్తవారు విస్తరణలో మంత్రి పదవులు దక్కించుకునే ఛాన్స్ కనిపిస్తోంది. కొత్త మిత్రపక్షాలతో పాటు , బీజేపీ పాలిత రాష్ట్రాలు, అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలకు కొత్త మంత్రివర్గంలో ప్రాతినిధ్యం కల్పించనున్నారు.
ఉత్తరప్రదేశ్ లో బీజేపీ ఘనవిజయం సాధించటంతో ఆ రాష్ట్రం నుంచి మరొకరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలన్నది మోడీ, షా ఆలోచన. ఇటీవలే ఎన్డీఏ గూటికి చేరిన జేడీయూ కు కూడా మంత్రి పదవులు దక్కనున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ కు పునర్ వ్యవస్థీకరణలో అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నారు. అటు తెలంగాణ నుంచి కేంద్ర జలవనరుల శాఖ సలహాదారుగా పనిచేస్తున్న వెదిరె శ్రీరామ్ కు మంత్రి పదవి లభించవచ్చని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఢిల్లీ, కర్నాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి కొత్తవారికి అవకాశమివ్వనున్నారు. తమ శాఖలతో పాటు అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న అరుణ్ జైట్లీ, స్మృతి ఇరానీ వంటి వారికి ఇక భారం తగ్గనుంది.
విస్తరణలో ఈ శాఖలకు కొత్త మంత్రులను కేటాయిస్తారు. రైల్వేశాఖ మంత్రిని కూడా మార్చే అవకాశం కనిపిస్తోంది. వరుస రైలు ప్రమాదాల నేపథ్యంలో రాజీనామాకు సిద్ధపడిన సురేశ్ ప్రభును కొంతకాలం ఆగమని సలహా ఇచ్చిన మోడీ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా ఆయన రాజీనామాను ఆమోదించే అవకాశముంది. ఆయనకు మరేదన్నా కొత్త శాఖ కేటాయించనున్నారుకేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత మంత్రివర్గాన్ని విస్తరించటం ఇది మూడోసారి. ఆదివారం ఉదయం పదిగంటలకు కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారు.
మరిన్ని వార్తలు: