2 కంట్రీస్… తెలుగు బులెట్ రివ్యూ

2 Countries review

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

నటీనటులు : సునీల్, మనీషా రాజ్, శ్రీనివాస్ రెడ్డి, నరేష్, 30 ఇయర్స్ పృథ్వీ
సంగీతం : గోపీ సుందర్‌
నిర్మాత, దర్శకత్వం : ఎన్. శంకర్
సినిమాటోగ్రఫీ: రాం ప్రసాద్
ఎడిటర్ : కోట‌గిరి వెంక‌టేశ్వ‌ర‌రావు

కమెడియన్ గా ఎన్నో చిత్రాల్లో నటించి, తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు దక్కించుకొని, అగ్ర కమెడియన్ గా ఎదిగాడు సునీల్. తర్వాత అందాల రాముడు సినిమాతో హీరోగా మారి, హిట్, ప్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా మూవీస్ లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తునాడు. ఇప్పడు సునీల్ కథానాయకుడిగా, ఎన్ శంకర్ దర్శకత్వంలో మలయాళ సినిమాకు రీమేక్ గా రూపొందిస్తున్న 2 కంట్రీస్ మూవీ లో నటిస్తున్నాడు. మరీ ఈ సినిమాతో అయినా సునీల్ హీరోగా సక్సెస్ సాధిస్తాడా? లేదో ? తెలుసుకోవాలంటే ఒకసారి రివ్యూ చూడాల్సిందే…

కథ :

ఉల్లాస్ కుమార్ (సునీల్) ఒక మారుమూల పల్లెటూరులో నివసిస్తూ ఉంటాడు. కష్టపడకుండా డబ్బులు సంపాదించాలనుకుంటాడు. ఫ్రీ గా డబ్బు సంపాదించటమే ధ్యేయంగా జీవిస్తుంటాడు. డబ్బు సంపాదించే క్రమంలో ప్రాణ స్నేహితులను, కుటుంబ సభ్యులను కూడా ఇబ్బందుల్లోకి నెడుతుంటాడు. ఒకరోజు పటేల్ అనే ఒక గుండా దగ్గర డబ్బు తీసుకుంటాడు. కానీ తను తీసుకున్న డబ్బు ను తగిన సమయంలో కట్టలేకపోతాడు. అప్పుడు పటేల్ ఒక కండిషన్ పెడతాడు, రెండు కాళ్లు లేని తన కూతురుని పెళ్లి చేసుకుంటే నిన్ను, నీ ఫ్యామిలీ ని వదిలేస్తాను అనడంతో, కాళ్లు లేని అమ్మాయిని చేసుకోవడానికి ఒప్పుకుంటాడు. అయితే అదే సమయంలో ఫారిన్ లో సెటిల్ అయిన తన చిన్ననాటి స్నేహితురాలు లయతో పరిచయం అవుతుంది. ఆ పరిచయం ప్రేమగా మారుతుంది. అప్పుడు ఉల్లాస్ ఆమె కోట్ల ఆస్తి ఉంది అని తెలుసుకొని, ఆ ఆస్తి సొంతం చేసుకోవాలన్న ఆశతో పటేల్ చెల్లిని కాదని లయను పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. చిన్నతనంలోనే లయ తన అమ్మ నాన్నలతో విడిపోతుంది, వాళ్ళతో విడిపోయిన లయ మద్యానికి బానిసవుతుంది. ఉల్లాస్ అయితే తన అలవాట్లకు అడ్డురాడన్న నమ్మకంతో అతడితో పెళ్లికి అంగీకరిస్తుంది. అయితే పెళ్లి తరువాత ఉల్లాస్ కి లయ ఇలా అవ్వటానికి కారణం తెలుస్తుంది, అప్పుడు లయతో ఎలాగైనా మందు మాన్పించే ప్రయత్నం చేస్తాడు ఉల్లాస్. ఈ క్రమంలో వాళ్ళిద్దరి మధ్య విభేదాలు వస్తాయి. అప్పుడు ఉల్లాస్ ప్రేమను లయ అర్థం చేసుకుంటుందా..? లేదా..? లయను మార్చే ప్రయత్నంలో ఉల్లాస్ తనకు ఎదురైనా ఇబ‍్బందులను ఎలా ఎదుర్కొంటాడు? ఇవన్ని తెలుసుకోవాలంటే  2 కంట్రీస్ సినిమా చూడాల్సిందే 

విశ్లేషణ :
సునీల్ ఎప్పటిలాగానే తన కామెడీ టైమింగ్ తో అరిపించాడు, డాన్స్, ఎమోషనల్ సీన్స్ లో సునీల్ నటన అధ్బుతంగా ఉంది. ఇంకా హీరోయిన్ గా నటించిన మనీషా రాజు బాగా నటించింది. తొలి సినిమానే అయినా కుడా మనీషా రాజ్ మంచి నటన కనబరిచింది, ముఖ్యంగా మద్యానికి బానిసైన అమ్మాయి పాత్రలో జీవించేసింది. హీరో ఫ్రెండ్ పాత్రలో నటించిన శ్రీనివాస్ రెడ్డి, 30 ఇయర్స్ పృథ్వీ కామెడీ చాలా బాగుంది. విడాకులు ఇప్పించే లాయర్ గా ఝాన్సీ , లాయర్ భర్తగా నరేష్ చాలా బాగా నటించారు. వాళ్ళ కామెడీ కుడా సినిమాలో బాగా ప్లస్ అయింది.

ఇక దర్శకుడు విషయానికి వస్తే మలయాళంలో ఘనవిజయం సాధించిన ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునేలా తెరకెక్కించడంలో దర్శకుడు ఎన్.శంకర్ విఫలం అయ్యాడు. మలయాళం మూవీ లా కాకుండా తెలుగు ప్రేక్షకుల ఇష్టాలకు అనుగుణంగా స్క్రీన్ ప్లే ని కొంచెం మార్చితే బాగుండేది అని అనిపించింది. పైగా రెండు గంటల 40 నిమిషాల సినిమా నిడివి కూడా ప్రేక్షకుల సహనాన్ని కోల్పోయేలా చేస్తుంది. గోపిసుందర్ సంగీతం పరవాలేదనిపిస్తుంది. సినిమాటోగ్రఫి రాం ప్రసాద్ పల్లెటూరి అందాలతో పాటు ఫారిన్ లొకేషన్స్ ను కూడా చాలా బాగా చూపించారు. ఎడిటింగ్ లో కొన్ని కట్స్ చేసి ఉంటె బాగుండేది. ఈ సినిమా నిర్మాణవిలువలు చాలా బాగున్నాయి.

ప్లస్ పాయింట్స్ :
సినిమాటోగ్రఫి
కొన్ని కామెడీ సీన్స్

మైనస్ పాయింట్స్ :
కథా కథనం
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్

తెలుగు బులెట్ రేటింగ్ … 2.25/5 .