నిన్నటి వరకు ఒకరంటే ఒకరు కయ్యానికి కాలు దువ్విన వై స్ర్ సి పీ తో జనసేనాని జత కట్టనున్నడా ?? అవుననే అంటున్నవిశ్వసనీయ వర్గాలు .. ఈ వ్యుహాత్మక మౌనం వెనక ఆంతర్యం ఏమిటి?? జగన్ తో జనసేనాని పొత్తు గురించి ఎవరు బహిరంగంగా మాట్లాడినా పవన్ కళ్యాణ్ దీన్ని ఖండించక పోవడాన్ని సులభం గానే అర్ధం చేస్కోవచ్చు .
రాజకీయం లో శాశ్విత మిత్రుడు , శత్రువు ఎవరు ఉండరు … అవసరానికి అడే ఆటలన్నీ … శత్రువు- శత్రువు మిత్రుడైన చందం గా జగన్ , పవన్ కళ్యాణ్ మధ్య అవసరానికి మిత్రత్వం కుదిరింది .. …ఈ బంధం నిలిచి, గెలిచేనా?? విడిచి వగచేనా ??ఈ బంధం నిలిస్తే మరి నాయకుడు ఎవరు ?? సైనికుడు ఎవరు ?? జగనా ?? పవనా ?? ఇప్పటికె ఎన్నికల్లో పోటి చేసి ప్రతిపక్ష స్థాయిని దక్కించుకున్న పార్టీ , ఇంకా పురుడు పోసుకోని ఒక పార్టీ కి నాయకుని చేతికి పగ్గాలు ఇస్తుందా?? అధికారమే ఇద్దరి కల అయినప్పుడు ఎవరు రాజీ పడాలి ??
పిల్లి పిల్లి కొట్టుకుంటే కోతి లాభపడినట్లు వీళ్ళిద్దరి పొత్తు వల్ల చంద్రబాబుకి ఎక్కువ లాభం . పోనీ….పవన్ ,చంద్ర బాబు తో జత కడితే కలలో కుడా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఇవ్వడు .. బలం ,బలగం నిరూపించుకోవాలి అంటే జగన్ తో జతకట్టడం తప్ప వేరే దారి లేదు… లెఫ్ట్ పార్టీ లను జనమే నమ్మే స్థితిలో లేరు ఇక జనసేనాని వాళ్ళను నమ్మి బరి లోకి దిగలేడు.నిన్నటి వరకు దుమ్మెత్తి పోసుకుని వ్యక్తిగత విషయాలను రచ్చ చేసుకున్న నాయకులు రేపటి రోజున భుజం భుజం రాసుకుంటూ ఓట్లు అడగడానికి వచ్చిన పెద్ద ఆశ్చర్య పోవనసరం లేదు … వాళ్ళు అధికారం లోకి రావాలంటే రచ్చ చేయాలి, అదే మరి రాజకీయం !!!