Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నిందితుడిగా ఉన్న సోహ్రబుద్దీన్ ఎన్ కౌంటర్ కేసును విచారిస్తూ మృతి చెందిన సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి బ్రిజ్ గోపాల్ హరికిషన్ లోయా మృతి కేసు అప్పటిలో ఎంత సంచలనం కలిగించిందో అందరికీ తెలిసిన విషయమే. . జస్టిస్ లోయా 2014 డిసెంబర్లో మహారాష్ట్రలో మరణించారు.
అయుతే ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి మరో విషయం తెరమీదకి వచ్చింది అదేంటంటే ‘ద కారవాన్’ మ్యాగజైన్ మరో అనూహ్య విషయాలతో వార్తా కథనాన్ని వెల్లడించింది. కేసు నుంచి అమిత్ షాను బయటపడేయటానికి జస్టిస్ లోయాను ప్రలోభపెట్టారని వాటికి లొంగలేదని వార్తలువచ్చాయి. అయితే అదే సమయంలో లోయా హఠాత్తుగా డిసెంబరు 1 – 2014న మరణించటం సర్వత్రా అనుమానం రేకెత్తించింది
ఆసలు జస్టిస్ లోయా మరణం సహజమైనదా ? కుట్ర దాగి వుందా ? అన్నదాని పై ప్రస్తుతం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న దీపక్ మిశ్రా – జస్టిస్ ఏఎం.ఖాన్ వికార్ – జస్టిస్ డీవై చంద్రచూడ్ లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ జరుపుతోంది. జస్టిస్ లోయా మృతిపై మీడియా కథనాలన్నీ ఊహాత్మకమైనవని కొట్టిపారేస్తూ – ఆయన సహజ మరణం పొందారని మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకు నివేదిక అందజేసింది.
కానీ..మహారాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నది తప్పు…అని ‘ద కారవాన్’ మ్యాగజైన్ తాజాగా ప్రచురించిన వార్తా కథనం పేర్కొనటం సంచలనం సృష్టిస్తోంది. ఈ కథనం ప్రకారం జస్టిస్ లోయా శవ పరీక్షను డాక్టర్ ఎన్కే.తుమ్రామ్ అనే ఆయన జరిపారు. ఆయన ఆ సమయంలో నాగపూర్ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆయన ఫోరెన్సిక్ విభాగంలో లెక్చరర్‌గా ఉన్నారు. అయితే ఈ శవపరీక్ష ఆపరేషన్ అంతా ప్రొఫెసర్ ‘మకరాంద్ వ్యవహారే’ నేతృత్వంలో జరిగింది. అనేక పోస్ట్‌మార్టం నివేదికల్ని మార్చారన్న ఆరోపణలు ఈయనపై నమోదై ఉన్నాయి.
మహారాష్ట్ర ఆర్థిక మంత్రి సుధీర్ మంగన్తివార్కు ప్రొఫెసర్ మకరాంద్ వ్యవహారే బావ అవుతారు. ఈయన మహారాష్ట్ర మెడికల్ కౌన్సిల్ సభ్యుడిగా కూడా ఉన్నారు. వైద్యఆరోగ్య శాఖలో శక్తివంతమైన స్థానంలో ఉండి ఆయన పలు శవ పరీక్షల నివేదికల్ని మార్చివేశారన్న ఆరోపణలు నాగపూర్ ప్రభుత్వ వైద్య కాలేజీలో ఎదుర్కొన్నారు.
ఈనేపథ్యంలో జస్టిస్ లోయా శవపరీక్ష నివేదికను సైతం ఆయన మార్పించారని నాగపూర్ ప్రభుత్వ కాలేజీలోని 14మంది ఉద్యోగస్తులు ‘ద కారవాన్’కు తెలియజేశారని ‘ద కారవాన్’ పత్రిక సంచలన విషయాన్ని బయట పెట్టింది. ఈ విషయాన్ని గనుక ప్రతిపక్ష-విపక్షాలు సీరియస్ గా తీసుకుని విచారణ చేయిస్తే అమిత్ షా నేరం బయటపడకపోయినా ఆయనని కార్నర్ చేసే అవకాశం వచ్చినట్టుఅవుతుంది.





