‘అర్జున్‌ రెడ్డి’కి అదే పెద్ద మైనస్‌ అయ్యేలా ఉంది

3 Hours Rush Time Minus point For Arjun Reddy movie

 

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]  

విజయ్‌ దేవరకొండ, షాలిని జంటగా తెరకెక్కిన ‘అర్జున్‌ రెడ్డి’ చిత్రంపై సినీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి ఉంది. ఇటీవలే విడుదలైన టీజర్‌ మరియు ట్రైలర్‌లతో సినిమా స్థాయి అమాంతం పెరిగింది. అసలు సినిమా ఎలా ఉంటుందా అనే ఆసక్తి ట్రైలర్‌ను చూస్తుంటే అనిపిస్తుంది. కథ ఖచ్చితంగా కొత్తగా ఉంటుందని, హీరో విజయ్‌ దేవరకొండ ఖచ్చితంగా ప్రేక్షకులను అర్జున్‌ రెడ్డిగా ఆకట్టుకోబోతున్నాడు అనిపిస్తుంది. ఆయన సినిమాపై పూర్తి నమ్మకంతో ఉన్నాడు. ఒక వేళ సినిమా నచ్చకపోతే చెప్పండి అంటూ ఛాలెంజ్‌ చేశాడు. అంతటి నమ్మకంతో సినిమాను చేసిన చిత్ర యూనిట్‌ సభ్యులు ఈవారంలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

సినిమాను విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. సెన్సార్‌ కార్యక్రమాలు కూడా పూర్తి అయ్యాయి. ఈ సినిమాకు సెన్సార్‌ బోర్డు ఎ సర్టిఫికెట్‌ ఇవ్వడం జరిగింది. రొమాంటిక్‌ సీన్స్‌తో పాటు యాక్షన్‌ సీన్స్‌ కాస్త ఎక్కువగా ఉన్న కారణంగా ఎ ఇవ్వడం జరిగింది. ఇక ఈ చిత్రం 3 గంటల నిడివితో రాబోతుందని సెన్సార్‌ సర్టిఫికెట్‌ను చూస్తే అర్థం అయ్యింది. ఇటీవల ఏ సినిమా కూడా మూడు గంటల నిడివితో వచ్చింది లేదు. రెండున్నర గంటలకు మించి ఉంటే ఫలితం తారు మారు అయ్యే అవకాశం ఉంది. గతంలో నిడివి ఎక్కువ అవ్వడం వల్ల సినిమాలు ఫ్లాప్‌ అయిన సంఘటనలు ఉన్నాయి. అందుకే ఈ సినిమాకు కూడా నిడివి పెద్ద మైనస్‌ అవుతుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

మరిన్ని వార్తలు:

అఖిల్ ‘హలో’ టీజర్ ని రిలీజ్ చేసిన సెలబ్రిటీస్… వీడియో

చిరు 151 టైటిల్ మారింది… కటౌట్ అదిరింది – వీడియో