Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
వారం రోజుల కిందట గుంటూరు జిల్లా దాచేపల్లిలో తొమ్మిదేళ చిన్నారిపై లైంగిక దాడి ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఘటన తర్వాత నిందితుడు సుబ్బయ్య ఉరివేసుకుని చనిపోయాడు. అయితే అది ప్రభుత్వం చేయించిన హత్య అని పలువురు వాదిస్తుండగా దాచేపల్లిలో జరిగిన అత్యాచార ఘటన మరవక ముందరే అదే గుంటూరు జిల్లాలో మరో దారుణం చోటుచేసుకుంది. జిల్లాలోని మోదుకూరులో ఏడేళ్ల చిన్నారిపై ఓ యువకుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. మూడు రోజుల క్రితమే ఘటన జరుగగా అది ఆలస్యంగా బయటకి వచ్చిందని తెలుస్తోంది. మొన్న దాచేపల్లి ఘటనే ఆంధ్రప్రదేశ్ లో చివరి అత్యాచార ఘటన కావలి అంటూ అత్యాచార అవగాహన ర్యాలీ ‘ఆడబిడ్డకు రక్షగా కదులుదాం’ అంటూ టీడీపీ ప్రభుత్వం చేపట్టినరోజే మరో కీచకపర్వం వెలుగులోకి రావడం గమనార్హం.
పూర్తి వివరాల లోకి వెళితే గుంటూరు జిల్లా చుండూరు మండలం మోదుకూరుకు చెందిన ఏడేళ్ల చిన్నారిపై అదే గ్రామానికి చెందిన 24 ఏళ్ల నాగుల్‌మీరా అనే యువకుడు అత్యాచారం జరిపాడు. పాపకు బావ వరసయ్యే నిందితుడు… ఆదివారం ఇంట్లో ఎవరూలేని సమయంలో చాక్లెట్లు కొనిపెడతా రమ్మంటూ చిన్నారిని తీసుకెళ్లి ఘోరానికి ఒడిగట్టాడు. సాయంత్రానికి ఇంటికొచ్చిన తల్లిదండ్రులు పాప పరిస్థితి చూసి కంగారుతో ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యపరీక్షల్లో చిన్నారిపై అత్యాచారం జరిగినట్లు తేలింది. దీంతో పాప తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి చెప్పిన వివరాలను బట్టి నిందితుడిని గుర్తించిన పోలీసులు… అతనిని అదుపులోకి తీసుకున్నారు. తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో బాలికకు చికిత్స అందిస్తున్నారు.