Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నందమూరి బాలకృష్ణ తన తండ్రి అన్నగారు ఎన్టీఆర్ జీవిత చరిత్రతో సినిమా తీయాలని ఉవ్విల్లూరుతున్నాడు. ఆరు నెలల క్రితమే బాలయ్య తన తండ్రి ఆటోబయోగ్రఫీ మూవీ గురించి ప్రకటించడం జరిగింది. అప్పటి నుండే ఆయనకు సంబంధించిన కొందరు స్క్రిప్ట్ వర్క్ మొదలు పెట్టారు. అన్నగారు ఎలా ఒక స్టార్ హీరో అయ్యారు, అక్కడ నుండి సీఎంగా ఎలా అయ్యారు అనే విషయాలను సినిమాలో చూపించబోతున్నారు. ఇక ఈ సినిమాకు దర్శకుడిని వారం రోజుల్లో ప్రకటిస్తాను అంటూ ఇటీవలే బాలయ్య చెప్పుకొచ్చిన విషయం తెల్సిందే. వారం రోజులు దాటిపోయింది, దర్శకుడు ఎవరు అనే విషయంలో క్లారిటీ రాలేదు.
దర్శకుడు విషయం ఏమో కాని, ఈ సినిమాను 75 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించాలని బాలయ్య భావిస్తున్నాడు. ఇప్పటికే ఒక కొత్త నిర్మాతకు ఆ అవకాశం ఇస్తున్నట్లుగా బాలయ్య సన్నిహితులతో చెప్పుకొచ్చాడు. ఆ నిర్మాత 75 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు సిద్దంగా ఉన్నాడు. ప్రస్తుతం టీడీపీలో కీలక నేతగా ఉన్న ఆ నిర్మాత బాలయ్యపై అంత బడ్జెట్ పెట్టేందుకు ముందుకు వచ్చాడు. ఇప్పటి వరకు బాలయ్య కెరీర్‌లో అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమా ‘గౌతమిపుత్ర శాతకర్ణి’. ఆ సినిమాకు 55 కోట్ల బడ్జెట్ అయినట్లుగా సమాచారం. కాని ఇప్పుడు ఎన్టీఆర్ సినిమా కోసం బాలయ్య 75 కోట్లు ఖర్చు పెట్టిస్తున్న నేపథ్యంలో ఆస్థాయి కలెక్షన్స్ రాబట్టేనా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
మరిన్ని వార్తలు: