ఒకసారి చూడాలనిపించే మూవీ — “ది ఫ్యామిలీ స్టార్”

A must see movie -- "The Family Star"
A must see movie -- "The Family Star"

విడుదల తేదీ : ఏప్రిల్ 5, 2024

తెలుగు బుల్లెట్ రేటింగ్ : 2.75/5

నటీనటులు: విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్, జగపతిబాబు, వెన్నెల కిషోర్, అభినయ, ప్రభాస్ శ్రీను

దర్శకుడు: పరశురాం పెట్ల

నిర్మాతలు: దిల్ రాజు

సంగీత దర్శకులు: గోపీ సుందర్

సినిమాటోగ్రాఫర్‌: కే యూ మోహనన్

ఎడిటింగ్: మార్తాండ్ కే వెంకటేష్

టాలీవుడ్ క్రేజీ కాంబినేషన్ రౌడి హీరో విజయ్ దేవరకొండ అలాగే మృణాల్ ఠాకూర్ లు హీరో హీరోయిన్ లుగా దర్శకుడు పరశురాం పెట్ల తెరకెక్కించిన అవైటెడ్ మూవీ నే “ది ఫ్యామిలీ స్టార్”. మరి ఈ వేసవి కానుకగా కుటుంబ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చిన ఈ మూవీ అంచనాలు అందుకుందో లేదో సమీక్షలో చూద్దాం రండి.

కథ :

ఇక కథలోకి వస్తే ఒక సాధారణ మధ్య తరగతి కుటుంబానికి చెందిన యువకుడు గోవర్ధన్ (విజయ్ దేవరకొండ) ఒక ఆర్కిటెక్ట్ ఇంజినీర్ చిన్నపాటి ఉద్యోగంతో తన కుటుంబ బండిని అదుపు పొదుపులతో పేరుకు తగ్గట్టుగానే ఆ బరువు భాద్యత లను మోస్తాడు. మరి తన జీవితంలోకి తన ఇంటి మీదకి అద్దెకి ఉండేందుకు ఒక అమ్మాయి ఇందు (మృణాల్ ఠాకూర్) వచ్చాక తన లైఫ్ ఎలా టర్న్ అవుతుంది? అసలు ఆమె తన జీవితం లోకి ఎందుకు వచ్చింది ఈ నేపథ్యంలో కి ఎదురైన సవాళ్లు ఏమిటి ? వాళ్ళు కలుస్తారా లేదా? అసలు ఇందు ఎవరు? చివరికి ఈ ఫ్యామిలీ స్టార్ ఏం చేస్తాడు అనేది వెండితెరపై చూడాల్సి ఉంది .

ప్లస్ పాయింట్స్ :

మొదటగా నటీనటులు కోసం మాట్లాడుకున్నట్టు అయితే హీరో విజయ్ దేవరకొండ ఒక పర్ఫెక్ట్ ఫ్యామిలీ మ్యాన్ గా అయితే ఈ మూవీ లో కనిపిస్తాడు అనే చెప్పాలి. తన టైమింగ్ తన ఫ్యామిలీతో సాగే కొన్ని సీన్స్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కు టచ్ అవ్వొచ్చు. అలాగే తన పాత్రలో వేరియేషన్స్ ను కూడా విజయ్ బాగా పండించాడు. అలాగే తనపై కొన్ని మాస్ మూమెంట్స్ ఫ్యాన్స్ కు నచ్చవచ్చు.

ఇక హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తన పాత్రలో డీసెంట్ పెర్ఫామెన్స్ తో మెప్పిస్తుంది అని చెప్పాలి . ఇద్దరి నడుమ కెమిస్ట్రీ కొన్ని సీన్స్ లో బాగుంది. అలాగే ఆమె తన డీసెంట్ లుక్స్ నేచురల్ పెర్ఫామెన్స్ చాలా బాగున్నాయి. ఇంకా వీరితో జగపతిబాబు, వెన్నెల కిషోర్ ఇంకా సీనియర్ నటి రోహిణి హట్టంగడి తదితరులు తమ పాత్రలకి న్యాయం చేశారు.

మైనస్ పాయింట్స్ :

ఈ మూవీ లో మెప్పించే అంశాలు కంటే నొప్పించే అంశాలే ఎక్కువగా ఉన్నాయని చెప్పాలి. సింపుల్ కాన్సెప్ట్ అయినప్పటికీ మూవీ లో ఆకట్టుకునే కథనం ఒక ఫ్లో మిస్ అయ్యింది. ఆల్రెడీ ఈ తరహా సీన్స్ చూసేసాం అన్నట్టే ఉండే సన్నివేశాలు సాగదీతగా సాగే కథనం మొదటి సగం మలిసగంలో కూడా ఆడియెన్స్ సహనానికి పరీక్షలు పెడతాయి. అసలు మూవీ మెయిన్ అంశం లోకి వెళ్ళడానికి చాలా సమయం పడుతుంది.

A must see movie -- "The Family Star"
A must see movie — “The Family Star”

పోనీ అంతవరకు కథనం ఏమన్నా ఆసక్తిగా ఉందా అంటే అదీ అసలు కనిపించదు. సరైన ఎంటర్టైన్మెంట్ లేదు పోనీ భావోద్వేగ పరిచే ఎమోషన్స్ ఉన్నాయా అని అంటే అవి కూడా లేవు. ఈ లోపం మూవీ మొదలు నుంచి చివరి వరకు కనిపిస్తుంది. ఇక వీటితో పాటుగా మృణాల్ పాత్ర విజయ్ ని కలవడం వారిద్దరి సీన్స్ లో పొంతన లేదు . అలాగే విజయ్ పై కొన్ని సన్నివేశాలు చాలా అతిగా అనిపిస్తాయి.

ఇంకా వాసుకి, అభినయ లాంటి నటులకి పెద్ద ఇంపార్టెన్స్ కనిపించదు. ఇంకా విజయ్, పరశురాం నుంచి గీతా గోవిందం లాంటి సాలిడ్ ఎంటర్టైనర్ చూసి ఈ సినిమా విషయంలో అంచనాలు పెట్టుకొని చూసేవారు డిజప్పాయింట్ అవ్వొచ్చు. అలాగే జస్ట్ కొన్ని సీన్స్ మినహా సినిమా అంతా బోర్ గానే సాగుతుంది.

సాంకేతిక వర్గం :

ఈ చిత్రంలో నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమాలో అవసరానికి తగ్గట్టుగా దిల్ రాజు పెట్టారు. ఇక టెక్నికల్ టీం లో గోపి సుందర్ మ్యూజిక్ చాలా యావరేజ్ గా ఉంది. కే యూ మోహనన్ సినిమాటోగ్రఫీ బాగానే ఉన్నది . అలాగే మార్తాండ్ కే వెంకటేష్ ఎడిటింగ్ లో పలు బోర్ అండ్ రొటీన్ సీన్స్ ను తగ్గించాల్సింది.

ఇక దర్శకుడు పరశురాం పెట్ల విషయానికి వస్తే.. ఈ మూవీ తన కెరీర్ లో వీక్ వర్క్ అని చెప్పక తప్పదు. విజయ్ పాత్రని ప్రతి మధ్య తరగతి కుటుంబంలో ఇలాంటి వాడు ఒకడు ఉండాలి అనేలా ప్లాన్ చేసుకున్నారు కానీ దీనిని ఆవిష్కరించడంలో డిజప్పాయింట్ అయ్యారు . మెయిన్ గా తన నుంచి ఉండే ఎంటర్టైనింగ్ మరియు ఎమోషనల్ నరేషన్ ఈ మూవీ లో బాగా మిస్ అయ్యినట్టు అనిపిస్తుంది. ఏవో చాలా తక్కువ సీన్స్ మినహా మూవీ ని తాను బోర్ గానే నడిపించారు.

తీర్పు :

ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “ది ఫ్యామిలీ స్టార్” లో మెయిన్ లీడ్ పర్వాలేదనిపిస్తారు. అలాగే కొన్ని సీన్స్ మాత్రం కేవలం ఓకే అనిపిస్తాయి కానీ విజయ్, పరశురాం పెట్ల హిట్ కాంబినేషన్ నుంచి అంచనాలు అందుకునే రేంజ్ మూవీ అయితే ఇది కాదు. ఎమోషన్స్ వర్కవుట్ కాలేదు, కథనం నిరాశపరుస్తుంది. దర్శకుడు ఇంకా కథ, కథనాలు పై వర్క్ చేయాల్సింది. వీటితో అయితే ఈ ఫ్యామిలీ స్టార్ బిలో యావరేజ్ ఫ్లిక్ గా నిలిచిపోయింది.