Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
జనవరి, ఫిబ్రవరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న కర్ణాటకలో బీజేపీ గెలుపు ఖాయమని, యడ్యూరప్ప మళ్లీ సీఎం అవుతారని ఆయన అనుచరులు సంబరపడుతున్నారు. కానీ కన్నడ నటుడు చేతన్ మాత్రం యెడ్డీపై తీవ్ర ఆరోపణలు చేశారు. అన్ని మఠాలకు 300 కోట్లు లంచాలు ఇచ్చి సీఎం అయ్యారని తీవ్రంగా మండిపడ్డారు. చేతన్ విమర్శలు ఇప్పుడు కర్ణాటకలో కలకలం రేపుతున్నాయి.
యడ్యూరప్ప నేతృత్వంలో అధికారంలోకి వస్తామని లెక్కలేసుకుంటున్న యెడ్డీకి లింగాయత్ సమావేశంలోనే ఎదురుదెబ్బ తగలడంపై ఆలోచనలో పడింది. అయితే ఎన్నో ఎదురుదెబ్బలు తిన్న యెడ్డీని తక్కువగా అంచనా వేస్తే.. అసలుకే ముప్పు తప్పదని అందరికీ తెలుసు. అందుకే యడ్యూరప్ప చాణక్య బ్రెయిన్లో ఎలాంటి వ్యూహాలు రూపుదిద్దుకుంటున్నాయోనని అమిత్ షా వేచిచూస్తున్నారు.
యడ్యూరప్ప ఇప్పటికీ లింగాయత్ లో బలమైన లీడర్. ఆయన పైగా మాస్ లీడర్. చేతన్ అనే ఓ నటుడు చేసిన ఆరోపణల్ని జనం సీరియస్ గా తీసుకుని యెడ్డీకి ఓటేయకపోవడమంటూ ఏమీ ఉండదని విశ్లేషకుల అంచనా. ప్రస్తుతం సిద్ధరామయ్య సర్కారు కంటే యెడ్డీ వెయ్యిరెట్లు బెటరని బెంగళూరు వాసులు కూడా అనుకుంటున్నారు. అలాంటప్పుడు చేతన్ విమర్శలతో ఏమీ కాదని అంటున్నారు.
మరిన్ని వార్తలు: