మాస్ హీరో విశాల్ తమిళ నిర్మాత మండలి ప్రెసిడెంట్ గా ఉన్న సంగతి తెలిసిందే. సినిమా నిర్మాత మండలిలో ఓ వర్గం వారు విశాల్ కు వ్యతిరేకంగా ఆందోళనకు చేపట్టారు. తమిళ నిర్మాత మండలిలో అంతర్గతంగా చాలా విభేదాలు ఉన్నాయి. అవి నిన్న రచ్చ కెక్కి రోడ్డునా పడ్డాయి. అసలు విషయం ఏమిటి అంటే. ఈ శుక్రవారం 9 సినిమాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి.
అన్ని సినిమాలు ఒకే రోజు విడుదలైతే చిన్న సినిమాల పరిస్థితి ఏమిటని చిన్న నిర్మాత మండలి వర్గానికి చెందినా 50 మంది తమిళ నిర్మాణ మండలి కార్యాలయం చుట్టూ చేరి ఆందోళనకు దిగాయి. ఆ సమయంలో విశాల్ అక్కడ లేడు. కౌన్సిల్ సెక్రెటరి కదిరేషన్ తో గొడవకు దిగారు. విశాల్ ఫ్రెండ్స్ అయిన ఉదయ, ఆర్కే సురేష్ కూడా నిర్మాత మండలి తరుపున విశాల్ కు వ్యతిరేకంగా చేరారు. దీనిపైన విశాల్ స్పందన ఏమిటి అనేది త్వరలో తెలుస్తుంది.