Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నందమూరి హీరో బాలకృష్ణ పబ్లిక్‌లోకి వెళ్లిన ప్రతి సారి ఎవరినో ఒకరిని కొడుతూ బుక్ అవుతూనే ఉన్నాడు. ఆ మద్య బాలయ్య తీరుపై కొందరు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు బాలయ్య తీరుగానే కమల్ హాసన్ ప్రవర్తించాడు. తాజాగా ఒక పబ్లిక్ ఈవెంట్‌కు వెళ్లిన సందర్బంగా కమల్ హాసన్ వద్దకు ఒక అభిమాని వెళ్లేందుకు ప్రయత్నించాడు. ఆ సమయంలో కమల్ అంగరక్షకులు అతడిని తోసేసే ప్రయత్నం చేశారు. అయినా కూడా ఆ అభిమాని కమల్ వద్దకు వచ్చేందుకు విశ్వ ప్రయత్నం చేశాడు. చివరకు కమల్‌ను ముట్టుకునేందుకు ప్రయత్నించాడు. దాంతో ఆగ్రహంతో కమల్ ఒక్కసారిగా అభిమాని చేయి తీసి, కొట్టినంత పని చేశాడు. కోపంతో మొహం ఎరుపెక్కడం కూడా వీడియోలో గమనించవచ్చు.
అభిమానులను కమల్ కొట్టడంపై కొందరు తీవ్ర స్థాయిలో ఆగ్రహంను వ్యక్తం చేస్తున్నారు. అభిమానంతో దగ్గరకు వచ్చిన వ్యక్తిని అలాగేనా కొట్టేది అంటూ సోషల్ మీడియాలో జనాలు కమల్‌ను ప్రశ్నిస్తున్నాడు. తనపై వస్తున్న వివాదం గురించి స్పందించిన కమల్ హాసన్ తాను అతడిని కొట్టలేదు అంటూ చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. కమల్ హాసన్ ఈ విషయం గురించి మాట్లాడుతూ.. అతడు తన కాళ్లపై పడేందుకు ప్రయత్నించాడు అని, అందుకే అతడిని వద్దని వారించాను తప్ప, అతడిపై చేయి చేసుకోలేదు అంటూ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. అయితే వీడియోలో చూస్తుంటే మాత్రం కమల్ వివరణ ఏమాత్రం సంతృప్తిగా లేదు.