తమిళనాడులో ఏదైనా ఆపద వచ్చినా, ప్రజలకు ఏదైనా సమస్య తలెత్తినా కూడా నేరుగా రంగంలోకి దిగి విశాల్ సహాయక చర్యల్లో పాల్గొంటాడు. గతంలో పలు సందర్బాల్లో విశాల్ క్షేత్ర స్థాయికి వెళ్లి సాయం చేసిన దాఖలాలు చాలా ఉన్నాయి. కేవలం విశాల్ మాత్రమే కాకుండా పలువురు తమిళ హీరోలు కూడా క్షేత్ర స్థాయికి వెళ్లి సాయం చేస్తూ ఉంటారు. తాజాగా తమిళ హీరోలను నిఖిల్ ఫాలో అయ్యాడు. ఏపీలోని పలు జిల్లాలను తిత్లీ తుఫాన్ అతలాకుతలం చేసిన విషయం తెల్సిందే. దాంతో టాలీవుడ్ నుండి పలువురు స్టార్స్ సాయంను ప్రకటించారు. బర్నింగ్ స్టార్‌తో మెదలై విజయ్ దేవరకొండ, నందమూరి బ్రదర్స్, మెగా హీరోు ఇలా అంతా కూడా సీఎం రిలీఫ్ పండ్‌కు తమకు తోచిన విరాళంను ఇవ్వడం జరిగింది. హీరో నిఖిల్ మాత్రం స్వయంగా వెళ్లి వారికి సాయం చేశాడు.
శ్రీకాకుళం జిల్లాలో తిత్లీ దాటికి బాగా దెబ్బతిన్న ఒక ప్రాంతంలో నిఖిల్ పర్యటించాడు. ఆ సందర్బంగా అక్కడ వారికి నిఖిల్ 2500 కేజీల బియ్యం పంపిణీ చేయడంతో పాటు, 3 వేల మందికి బోజనం ఏర్పాటు చేయించాడు. వారితో పాటు నిఖిల్ కూర్చుని భోజనం చేశాడు. 500 దుప్పట్లు, పోర్టబుల్ జనరేటర్లు ఇచ్చాడు. ఈ విషయాన్ని ట్విట్టర్లో షేర్ చేసుకున్న నిఖిల్ తిత్లీ బాధితులను ఆదుకునేందుకు మీ వంతు సాయం చేయాల్సిందిగా పిలుపునిచ్చాడు. నిఖిల్ చేసిన పనికి అంతా కూడా అభినందిస్తున్నారు.