Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
వివాదాల దర్శకుడు రామ్గోపాల్ వర్మ ఇటీవలే టాలీవుడ్ డ్రగ్స్ కేసుపై షాకింగ్ వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే. సెలబ్రెటీలు అయిన కారణంగా వీరిని ఎక్కువ సమయం విచారిస్తున్నారు. స్టూడెండ్స్ను మరియు ఇతరులను ఇంత సమయం విచారిస్తారా అంటూ కామెంట్స్ చేశాడు. వర్మ వ్యాఖ్యలపై సర్వత్ర ఆగ్రహం వ్యక్తం అయ్యింది. సిట్ అధికారులు స్వయంగా వివరణ ఇచ్చారు. అందరు కూడా తమకు సమానం అని, సినీ ప్రముఖులు అయినంత మాత్రాన ఎక్కువ సమయం విచారణ చేయడం లేదు అని క్లారిటీ ఇచ్చారు. ఈ వివాదం సాగుతున్న సమయంలోనే వర్మ పేరు కూడా డ్రగ్స్ కేసులో వచ్చింది.
నటుడు సుబ్బరాజును విచారించిన సమయంలో పలువురు కొత్త వారి పేర్లు ప్రస్థావనకు వచ్చాయి. సుబ్బరాజు స్వయంగా వర్మకు డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉందనే విషయాన్ని చెప్పుకొచ్చాడు. సుబ్బరాజు, వర్మల మద్య చాటింగ్ కూడా సిట్ అధికారులు ముందు పెట్టి విచారణ చేపట్టారు. దాంతో ఈ కేసులో వర్మ కూడా జాయిన్ అయ్యాడు. త్వరలోనే వర్మకు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చేందుకు సిద్దం అవుతున్నారు. వర్మతో పాటు ఇంకా ముగ్గురు సినీ ప్రముఖులకు నోటీసులు ఇస్తారని తెలుస్తోంది. ఇప్పటికే నోటీసులు అందుకున్న వారి తర్వాత ఈ నలుగురు విచారణకు హాజరు అవుతారు. ఒక వేళ నోటీసులు అందుకుంటే వర్మ విచారణకు హాజరు అవుతాడా అనేది చూడాలి.
మరిన్ని వార్తలు: