Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
Adhi Role Clarifies In Pawan Kalyan Trivikram Movie
పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్‌ల కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. వీరిద్దరి కాంబినేష్లో వచ్చిన ‘జల్సా’ మరియు ‘అత్తారింటికి దారేది’ చిత్రాలు భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఆ సినిమాల తర్వాత వీరు ఇప్పుడు చేస్తున్న సినిమాతో హ్యాట్రిక్ సాధించడం ఖాయంగా సినీ వర్గాల వారు భావిస్తున్నారు. ఇక ఈ సినిమాలో విలన్‌గా ఆది నటిస్తున్న విషయం తెల్సిందే. ‘సరైనోడు’ చిత్రంలో విలన్‌గా నటించి మెప్పించిన ఆది ఇప్పుడు పవన్‌తో మరోసారి విలన్‌గా ఢీ కొట్టబోతున్నాడు.
చిత్ర యూనిట్ సభ్యుల నుండి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ చిత్రంలో పవన్‌కు ఆది తమ్ముడుగా కనిపిస్తాడని తెలుస్తోంది. చెడ్డ దారిలో పోయే తమ్ముడు ఆదిని అన్న ఎలా దారిలోకి తెచ్చుకున్నాడు, ఆదిని తప్పుడు దారిలో తీసుకు వెళ్లిన విలన్‌ను పవన్ ఎలా ఎదుర్కొన్నాడు అనేది సినిమా కథాంశంగా తెలుస్తోంది. ఆది ఇటీవలే మాట్లాడుతూ పవన్‌తో నటించడం చాలా సంతోషంగా ఉందని, ఆయనతో ఫైటింగ్ చేస్తున్నట్లుగా కూడా చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం సారధి స్టూడియోలో కొన్ని ముఖ్యమైన సీన్స్‌లలో పవన్ కళ్యాణ్ నటిస్తున్నాడు. రంజాన్‌కు ఫస్ట్‌లుక్‌ను రివీల్ చేయాలని భావిస్తున్నారు. అదే సమయంలో టైటిల్‌పై కూడా క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయి. ఇక సినిమాను దీపావళికి విడుదల చేస్తారనే టాక్ వినిపిస్తుంది.
మరిన్ని వార్తలు
డీజే దుమ్ము రేపాడు – దువ్వాడ జగన్నాధం తెలుగు బులెట్ రివ్యూ