నటుడిగా విలక్షణమైన పాత్రలను చేస్తూ వచ్చిన రవిబాబు, దర్శకుడిగా కూడా విభిన్నమైన చిత్రాలను తెరకెక్కిస్తూ వస్తున్నాడు. చాలా గ్యాప్ ఇచ్చిన ఆయన తాజాగా ‘పందిపిల్ల’ ప్రధాన పాత్రగా ‘అదుగో’ సినిమాను రూపొందించాడు. పూర్తి వినోదభరితంగా నిర్మితమైన ఈ సినిమా నుంచి కొంతసేపటి క్రితమే టీజర్ ను రిలీజ్ చేశారు. బ్యాక్ గ్రౌండ్ నుండి ఓ చిన్న పిల్లాడి వాయిస్ ఓవర్ వస్తుండగా.. ఆ పిల్లాడు ఏమి చెబితే అది బంటి (పంది పిల్ల) చెప్పినట్టు చేయడం .. చూపించారు. ఈ టీజర్ చిన్నపిల్లలను ఆకట్టుకునేలానే వుంది. కేవలం పంది పిల్లను మాత్రమే చూపిస్తూ టీజర్ ను కట్ చేసిన రవిబాబు, సినిమాపై ఆసక్తిని పెంచడంలో సక్సెస్ అయ్యాడు. ఇండియన్ సినిమా చరిత్రలోనే తొలి సారి పూర్తి స్థాయి లైవ్ యాక్షన్ 3డి యానిమేషన్ ను చూపిస్తోన్న సినిమా ఇది. ఇందులో పందిపిల్లను చాలా రియల్ గా చూపించే ప్రయత్నం చేసారు గ్రాఫిక్స్ టీం. ఈ 12 న ట్రైలర్ రిలీజ్ కానుండడంతో త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నారని భావిస్తున్నారు. మీరు కూడా టీజర్ మీద ఒక లుక్ వేసెయ్యండి మరి