సెలబ్రిటీల జీవితం మీద సామాన్యులకి ఉన్న ఆసక్తి ఇంకెవరికీ ఉండదేమో. అందుకే సెలబ్రిటీల మీద వారి జీవితాల మీదా ఎన్నో ఊహాగానాలు, గాసిప్స్ వస్తూనే ఉంటాయి. తాజాగా టాలీవుడ్ లో మరో పెళ్లి వార్త వైరల్ అవుతుంది. త్వరలోనే అక్కినేని కుటుంబంలో పెళ్లి భాజాలు మోగనున్నాయని ప్రచారం జరుగుతుంది. అయితే మీరు అనుకున్నట్టు అఖిల్ కి అయితే కాదు. అయితే ఇప్పుడు అఖిల్ కాకుండా ఆ ఇంట్లో ఇంకెవరు ఉన్నారని అనుకుంటున్నరా ? నాగార్జున మేనకోడలు సుప్రియ యార్లగడ్డ రెండో వివాహం చేసుకోవడానికి సిద్ధమవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. హీరో నాగార్జున మేనకోడలు అయిన సుప్రియ హీరో సుమంత్ కి అక్క. ఇరవై ఏళ్ల క్రితం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రంతో హీరోయిన్గా టాలీవుడ్‌కి పరిచయమైన సుప్రియ, ఆ సినిమా ఆశించినంత హిట్ కాలేకపోవడంతో ఆమె నటనకు స్వస్తి చెప్పి నాగార్జునతో కలిసి అన్నపూర్ణ స్టుడియో వారి ప్రొడక్షన్ పనులు చూసుకుంటూ ఉండిపోయింది.
అయితే 2018లో అడవి శేష్ నటించిన గూఢచారి చిత్రంతో మళ్ళీ తెరంగ్రేటం చేసింది. నటన పట్ల పెద్దగా ఇంట్రస్ట్ చూపని సుప్రియ హీరో అడవి శేష్ కోరిక కాదనలేక మళ్లీ తెరముందుకు వచ్చిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఈ సినిమా షూట్ లో భాగంగా ఇద్దరి మధ్య మొదలయిన స్నేహం ప్రేమగా మారడంతో త్వరలో పెళ్లి పీటలు ఎక్కుబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ పెళ్లి రూమర్స్‌కి ఇటీవల అడవి శేష్ చేసిన ట్వీట్ మరింత బలాన్ని ఇచ్చేదిగా ఉంది. ఈ నెల తరువాత తానో పెద్ద అనౌన్స్మెంట్ చేయబోతున్నానంటూ అడవి శేష్ ట్వీట్ చేయడంలో అది సుప్రియతో పెళ్లి వార్తే అంటూ ఊహాగానాలు వస్తున్నాయి. ఇక వీరి పెళ్లికి అక్కినేని కుటుంబం నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని త్వరలో అఫీషియల్ అనౌన్స్మెంట్ రాబోతున్నట్టు సమాచారం. సుప్రియకు గతంలోనే పెళ్లయింది. అయితే ఆమె భర్త చరణ్ ఐదేళ్ల క్రితం అనారోగ్యంతో కన్నుమూశాడు.