Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అండర్ -19 వరల్డ్ కప్ లో పెను సంచలనం నమోదయింది. పసికూన ఆఫ్ఘనిస్థాన్ బలమైన న్యూజిలాండ్ పై ఘన విజయం సాధించింది. ఆఫ్ఘన్ ఆటగాళ్ల దెబ్బకి ఆతిథ్య న్యూజిలాండ్ యువజట్టు 202 పరుగుల భారీ తేడాతో ఘోర ఓటమి పాలయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆఫ్ఘన్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 309 పరుగులు చేసింది. ఓపెనర్లు గుర్బాజ్ 69 పరుగులు, జర్డాన్ 68 పరుగులు చేసి జట్టుకు శుభారంభాన్నిచ్చారు. బహీర్ షా, అజ్మతుల్లా..జట్టును భారీ స్కోరు దిశగా నడిపించారు.
ముఖ్యంగా అజ్మతుల్లా కేవలం 23 బంతుల్లో 66 పరుగులు సాధించి ఆప్ఘన్ ను తిరుగులేని స్థితిలో నిలబెట్టాడు. 310 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ ఆరంభం నుంచే పేలమైన ఆటతీరు ప్రదర్శించింది. ఆఫ్ఘన్ బౌలర్లు ముజీబ్, అహ్మద్ ధాటికి కివీస్ బ్యాట్స్ మెన్ చేతులెత్తేశారు. దీంతో 28.1 ఓవర్లలో 107 పరుగులకే న్యూజిలాండ్ కుప్పకూలింది. 202 పరుగుల భారీ విజయం సొంతంచేసుకున్న ఆప్ఘన్ సెమీఫైనల్ కు దూసుకుపోయింది. సెమీస్ లో ఆ జట్టు పాకిస్థాన్ తో తలపడనుంది. భారత్ బంగ్లాదేశ్ తో తదుపరి మ్యాచ్ ఆడనుంది.