హైదరాబాద్‌లో భారీ ఎత్తున ‘అజ్ఞాతవాసి’ బెన్‌ఫిట్‌ షోలు

Agnathavasi Movie Benefit Shows Theaters List in Hyderabad

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
భారీ అంచనాల నడుమ తెరకెక్కిన ‘అజ్ఞాతవాసి’ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. ఈనెల 10న సంక్రాంతి కానుకగా చిత్రాన్ని విడుదల చేయబోతున్న విషయం తెల్సిందే. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. కేవలం రెండు మూడు రోజుల్లోనే పెట్టుబడిని రికవరీ చేసి లాభాల బాట పట్టేల డిస్ట్రిబ్యూటర్లు ప్లాన్‌ చేస్తున్నారు. నిర్మాత కూడా అందుకోసం చాలా ప్రత్యేక ఏర్పాట్లు పెద్ద ఎత్తున చేస్తున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున బెన్‌ఫిట్‌ షోలు ఏర్పాటు చేసేందుకు చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం పట్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుకూలంగా వ్యవహరిస్తుంది. ఖచ్చితంగా బెన్‌ఫిట్‌ షో వేసే వీలు ఉంటుందని ఇప్పటికే బెన్‌ ఫిట్‌ షో కోసం ఏర్పాట్లు జరిగిపోయాయి. 

బెన్‌ఫిట్‌ షోతో ఈ చిత్రం భారీ ఎత్తున వసూళ్లు సాధించడం ఖాయం అని, ముఖ్యంగా హైదరాబాద్‌లో లెక్కకు మించి బెన్‌ ఫిట్‌ షోలు వేయబోతున్నట్లుగా సమాచారం అందుతుంది. ట్రాఫిక్‌ పోలీసులు మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎలాంటి ఇబ్బంది లేని కారణంగా బెన్‌ ఫిట్‌ షోల ద్వారా పెద్ద మొత్తంలో వసూళ్లను రాబట్టాలనే ఉద్దేశ్యంతో నైజాం డిస్ట్రిబ్యూటర్‌ ప్లాన్‌ చేస్తున్నాడు. ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమా కూడా హైదరాబాద్‌లో మొదటి రోజు రాబట్టని వసూళ్లను అజ్ఞాతవాసి రాబట్టడం ఖాయంగా కనిపిస్తుంది. ‘బాహుబలి 2’ రికార్డులను సైతం బద్దలు కొట్టేలా అజ్ఞాతవాసి మొదటి రోజు కలెక్షన్స్‌ ఉంటాయని ట్రేడ్‌ విశ్లేషకులు కూడా అంటున్నారు. పవన్‌ 25వ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాలో కీర్తి సురేష్‌ మరియు అను ఎమాన్యూల్‌లు హీరోయిన్స్‌గా నటించారు.