Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
విమానయాన శాఖ మాజీ మంత్రి, తెలుగుదేశం ఎంపీ అశోక్ గజపతిరాజుకి నిన్న చెడు అనుభవం ఎదురయ్యింది. అది కూడా తానూ ఒకప్పుడు మంత్రిగా పని చేసిన విమానయాన శాఖ అండర్ లో పని చేస్తున్న ఎయిర్ ఇండియా నుండి ఆ పరాభవం ఎదురు కావడం ఇప్పుడు అనుమానాలని రేకెత్తిస్తోంది. పూర్తి వివరాల లోకి వెళితే ఢిల్లీ నుంచి విశాఖపట్టణం వచ్చేందుకు ఆయన ఎయిర్ ఇండియా విమానంలో టికెట్ బుక్ చేసుకున్నారు. అయితే ఫ్లైట్ ఎక్కేందుకు ఢిల్లీ విమానాశ్రయానికి వెళ్లారు.
ఢిల్లీ విమానాశ్రయంలో ఆయన లగేజీని తనిఖీ చేసిన విమానాశ్రయ సిబ్బంది, దానిని తీసుకున్నారు. అశోక్ గజపతి రాజు ఫ్లైట్ ఎక్కి విశాఖ చేరుకున్నారు. ఆయన తన లగేజీ కోసం చూసుకుంటే అది ఎక్కడా కనపడలేదు, ఎంతకీ ఆయన లగేజీ రాలేదు. ఆ విమానంలో ప్రయాణించిన అందరి లగేజీ వచ్చినా తన లగేజీ మాత్రం రాకపోవడంతో అశోక్ గజపతి రాజు ఆశ్చర్యపోయారట. విషయం ఏమిటంటే, ఆయనను లోనికి అనుమతించిన తరువాత ఆయన బుక్ చేసిన లగేజీని తనిఖీ చేసి అక్కడే వదిలేశారు.
అయితే ఈ ఘటన ప్రభుత్వానికి చెందిన ఎయిర్ ఇండియా విమానలో జరగటంతో ఇది కాకతాళీయంగా జరిగిందా లేక కావాలని అశోక్ గజపతిని అవామనించాలని ఇలా చేశారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కేంద్ర పౌర విమానయాన శాఖా మంత్రిగా పనిచేసిన అశోక్ గజపతి నష్టాల్లో ఉన్న ఎయిర్ ఇండియాని ఆక్యుపెన్సీ పెంచి లాభాల బాటలో నడిపించారు. అదే విధంగా మోడీ క్యాబినెట్ లో మోస్ట్ ఎఫెక్టివ్ మినిస్టర్ గాను పేరు తెచ్చుకున్నారు. అయితే ఏపీ కి ప్రత్యేక హోదా విషయంలో ఎన్డీయే నుండి తెలుగుదేశం బయటకి వచ్చేసిన సమయంలో ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేసి బయటకి వచ్చేశారు. అయితే తెలుగుదేశం ఎంపీ గా ఆయన తెలుగుదేశం చేస్తున్న హోదా పోరాటాలన్నిటిలోను చురుగ్గా పాల్గొంటూ వచ్చారు.
మొన్న మోడీ ఇంటిని తెలుగుదేశం ఎంపీలు చుట్టుముట్టినప్పుడు కూడా ఆయన అక్కడే ఉన్నారు, తన తల్లి చనిపోయినా అంత్యక్రియలకి హాజరయ్యి వచ్చి రెండో రోజునే మోడీ ఇంటి ముట్టడి కార్యక్రంలో పాల్గొని అందరి కళ్ళలోను పడ్డారు, ఆ ఆందోళన ముగిసి ఆంధ్రాకి బయలుదేరే ముందే ఈ ఘటన జరగడం అనేక అనుమానాలకి తావిస్తోంది. ఎందుకంటే నెల రోజుల క్రితందాకా ఆయన క్యాబినెట్ మంత్రి, ఇప్పుడు మంత్రి కాకపోయినా ఎంపీ క్యాబినెట్ మంత్రి గా పని చేసిన వీఐపీ కి చెందిన వస్తువులని సాధారణంగా అయితే ఇలా నిర్లక్ష్యంగా వదిలివేయరు ఎయిర్ ఇండియా స్టాఫ్. అది కూడా ఆయన మంత్రిగా పని చేసిన విమానయాన శాఖకి చెందిన ఎయిర్ ఇండియా సిబ్బంది ఇలా వ్యవహరించే అవాకాశం ఉండదు సో ఇదంతా కావాలనే చేయించినట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కేవలం తెలుగుదేశం ఎంపీ అనే ఒక్క కారణంతో ఆయన్ని అవమానిస్తే తెలుగుదేశాన్ని అవమానించినట్టుగా కేంద్ర ప్రభుత్వ పెద్దలు భావించి ఉండచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.