పాపం మళ్ళీ పవన్ ఎవరో తెలీదు అన్నారుగా అశోక్ !

Ashok Gajapathi Raju says I don't know who is Pawan Kalyan

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌, మాజీ కేంద్ర‌మంత్రి అశోక్ గ‌జ‌ప‌తిరాజు… ఈ ఇద్ద‌రూ ఒక‌రి గురించి మ‌రొక‌రు చేసుకుంటున్న వ్యాఖ్య‌లు ఇప్పట్లో బ్రేక్ పడేలా లేవు. ప్ర‌జా పోరాట యాత్ర‌లో ఉన్న పవన్ ఈ మ‌ధ్య‌నే విజ‌య‌న‌గ‌రంలో అశోక్ గ‌జ‌ప‌తిరాజు గురించి మాట్లాడారు. అశోక్ గ‌జ‌ప‌తిరాజు అంటే త‌న‌కు ఎంతో గౌర‌వ‌మ‌నీ, రాజ‌వంశం మీద గౌర‌వ‌మన్నారు. అయితే, ప‌వ‌న్ క‌ల్యాణ్ అంటే ఎవ‌రో త‌న‌కు తెలియ‌ద‌ని ఆయన గతంలో అన్నారు. పవన్ కల్యాణ్ అంటే ఎవ‌రో తెలీద‌ని దాదాపుగా ఓ ఏడాది కింద‌ట అశోక్ గ‌జ‌ప‌తి రాజు వ్యాఖ్యానించారు. ఆయనెవరో తెలీదనీ, తాను సినిమాలు చూడటం మానేసి చాన్నాళ్లయిందన్నారు. అదిగో అక్కడే గొడవ మొదలైంది. ఆ స‌మ‌యంలో ప‌వ‌న్ స్పందిస్తూ ఓ ట్వీట్ కూడా చేశారు. తాను ఎవ‌రో కేంద్ర‌మంత్రిగారికి తెలీద‌ట‌, సంతోషం అని కామెంట్ చేశారు. స‌రే, అక్క‌డితో ఆ విష‌యం అయిపోయింద‌నుకుంటే… ఇప్పుడు విజ‌య‌న‌గ‌రం జిల్లాలోకి ప‌వ‌న్ యాత్ర వ‌చ్చాక‌… వ‌రుస‌గా క‌నీసం ఓ మూడు వేదిక‌ల మీద అదే అంశాన్ని ప‌వన్ ప‌దేప‌దే ప్ర‌స్థావించారు.

‘అశోక్ గ‌జ‌ప‌తి రాజుగారూ… ప‌వ‌న్ క‌ల్యాణ్‌ అంటే నేనే. నా పేరే ప‌వ‌న్ క‌ల్యాణ్‌. వీళ్లు నా అన్న‌ద‌మ్ములు, అక్క‌చెల్లెళ్లు. నేనే అది… ప్లీజ్‌’ అంటూ ఆయ‌న్ని ఉద్దేశించి మాట్లాడిన సంగ‌తి తెలిసిందే. అయితే, ఇదే అంశంపై తాజాగా టీడీపీ నేత అశోక్ గజ‌ప‌తి కూడా స్పందించారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ గురించి త‌న‌కు తెలియ‌ద‌ని మ‌రోసారి అశోక్ జ‌గ‌ప‌తి తాజాగా అన్నారు. తెర ముందు, తెర వెన‌క ప‌వ‌న్ క‌ల్యాణ్ అంటే త‌న‌కు తెలీద‌న్నారు. అంతేకాదు… ఎవ‌రో తెర వెన‌క ఉంటూ రాసి ఇచ్చినవి చ‌దువుతూ ఉండ‌టం వ‌ల్ల ఆయ‌న గౌర‌వం కోల్పోతున్నార‌ని వ్యాఖ్యానించారు. ఇక వైకాపా ఎంపీల రాజీనామాల గురించి కూడా మాట్లాడుతూ… అవి ఆమోదం పొంద‌వ‌ని తెలిసే నాలుగో తేదీ త‌రువాత రాజీనామాలు చేశార‌ని ఆరోపించారు. తాను కేంద్రమంత్రి ప‌ద‌వికి రాజీనామా చేసిన వెంట‌నే ఆమోదింప‌జేసుకున్నాననీ, ప్ర‌జ‌ల‌ను మోసం చేయ‌డం కోస‌మే వైకాపా ఈ రాజీనామా నాట‌కాలు ఆడుతోంద‌న్నారు.

ఎయిర్‌ ఎషియా విషయమై అశోక్‌ మాట్లాడుతూ సంబంధిత సీఈవో ఫోన్‌ సంభాషణతో తనకు సంబంధం లేదన్నారు. పాపం పవన్ రాజు గారిని అన్నిసార్లు నేనెవరో తెలిదు అంట అన్నా సరే మళ్ళీ ఇప్పుడు అశోక్ గజపతి రాజు తాజాగా మ‌రోసారి ప‌వ‌న్ ఎవ‌రో త‌న‌కు తెలీద‌నే అన్నారు. దీనికి పవన్ ఏమని స్పందిస్తారో వేచి చూడాలి మరి.