రజినీకాంత్, శంకర్ల కాంబినేషన్లో తెరకెక్కిన ‘2.ఓ’ చిత్రం ఈనెల చివర్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. రికార్డు స్థాయిలో ఈ చిత్రంను దాదాపుగా పది వేల థియేటర్లలో విడుదలకు సిద్దం చేస్తున్నారు. 3డి, 4డి టెక్నాలజీతో పాటు ఇంకా ఎన్నో రకాల టెక్నాలజీలతో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. సౌత్‌లోనే కాకుండా ఈ చిత్రం ప్రపంచం మొత్తంలో కూడా మంచి క్రేజ్‌తో విడుదల కాబోతుంది. బాలీవుడ్లో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఈ చిత్రంలో విలన్‌గా నటించడం వల్ల బాలీవుడ్ ప్రేక్షకులు ఈ చిత్రంపై ఆసక్తిని కలిగి ఉన్నారు. తాజాగా ఈ చిత్రంలో ఐశ్వర్య రాయ్ కూడా ఉండబోతుందనే వార్తలు సినీ వర్గాల్లో పుకార్లు చేస్తున్నాయి.
‘రోబో’ చిత్రంలో రజినీకాంత్‌కు జోడీగా ముద్దుగుమ్మ ఐశ్వర్యరాయ్ నటించిన విషయం తెల్సిందే. రజినీకాంత్, ఐశ్వర్య జంటకు మంచి పేరు వచ్చింది. దాంతో మరోసారి 2.ఓ చిత్రంలో వారిద్దరి జంటను కొద్ది సమయం చూపించాలని శంకర్ భావిస్తున్నాడట. అది ఎలా అనేది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. సినిమా విడుదల అయితే తప్ప ఐశ్వర్య ఈ చిత్రంలో ఎలాంటి పాత్రలో కనిపించబోతుందో తేలిపోతుంది. ఐశ్వర్య చిన్న గెస్ట్ రోల్లో నటించినా కూడా సినిమాపై అంచనాలు అమాంతం పెరిగే అవకాశం ఉంది. ఈ వార్తలో నిజం ఎంత ఉందో తెలియదు కాని, సినిమా పై అంచనాలను ఆకాశానికి తీసుకు వెళ్లింది. ఇప్పటికే ఈ చిత్రంలో అమీ జాక్సన్ హీరోయిన్గా నటిస్తున్న విషయం తెల్సిందే.