Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తమిళ స్టార్ హీరో అజీత్ తాజా చిత్రం ‘వివేగం’. ఈ సినిమాపై అజిత్ అభిమానులు భారీ స్థాయిలో అంచనాలు పెట్టుకున్నారు. సినిమా ప్రారంభం అయినప్పటి నుండి వివేగం గురించి జాతీయ మీడియాలో సైతం వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇక వివేగం టీజర్ ప్రపంచ రికార్డును సైతం సోషల్ మీడియాలో దక్కించుకుంది. ఈ స్థాయిలో అంచనాల నడుమ విడుదలైన వివేగం చిత్రం బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడటం జరిగింది. భారీ ఓపెనింగ్స్ వచ్చినా కూడా లాంగ్ రన్‌లో ఈ సినిమా కలెక్షన్స్ ఆ స్థాయిలో రాలేదు. విడుదలైన రెండు వారాల్లో ఈ సినిమా 150 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించినట్లుగా ట్రేడ్ వర్గాల నుండి సమాచారం అందుతుంది. ప్రపంచ వ్యాప్తంగా 80 కోట్ల షేర్‌ను ఈ సినిమా దక్కించుకుంది. నిర్మాతకు ఈ సినిమా లాభాలను తెచ్చి పెట్టినా డిస్ట్రిబ్యూటర్లకు మాత్రం భారీ నష్టాలను మిగిల్చింది. తమిళనాట 55 కోట్లకు ఈ సినిమా అమ్ముడు పోయింది. కాని ఇప్పటి వరకు కూడా ఈ సినిమా 35 కోట్ల మార్క్‌ను క్రాస్ చేయలేదు. అంటే 20 కోట్ల మేరకు నష్టం తప్పేలా లేదు. ఇక పలు ఏరియాల్లో కూడా ఆశించిన స్థాయిలో ఈ సినిమా వసూళ్లు సాధించలేదు. దాంతో ఈ సినిమా ఫ్లాప్ అంటూ ట్రేడ్ వర్గాల వారు తేల్చేశారు. అజిత్ అభిమానులు సైతం ఒకింత నిరుత్సాహంను వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని వార్తలు: