Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
దశాబ్దాలుగా మత రాజకీయానికి అలవాటు పడ్డ ఎంఐఎం నేతలు రజాకార్లను తలపిస్తూ ఎన్నికల్లో ఎలా గెలుస్తున్నారో ఎవరికీ అంతుబట్టడం లేదు. ప్రపంచంలోనే ముస్లింలు స్వేచ్ఛగా జీవిస్తున్న దేశం మనదేనని అందరూ మొత్తుకుంటుంటే.. వీరికి మాత్రం మైనార్టీలకు జరిగే అన్యాయాలే కనిపిస్తాయి. ఎప్పుడూ ముస్లింలను హిందువులపై రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవడంలో ఒవైసీ బ్రదర్స్ తండ్రిని మించిపోయారు. అందుకే ఎంతటి గట్టి ప్రత్యర్థి వచ్చినా అవలీలగా గెలిచేస్తున్నారు.
ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలు కేటాయించాలని బ్రిటీష్ కాలం నాటి ఆలోచనను అక్బర్ మళ్లీ లేవనెత్తారు. భిన్నత్వంలో ఏకత్వమే భారత్ ప్రాతిపదకని, అలాంటప్పుడు హిందువులతో పాటు ముస్లింలకూ సమాన హక్కు ఉందని చెబుతున్న శ్రీ ఒవైసీ గారు పాకిస్థాన్ వెళ్లి హిందువులకు సమాన హక్కులివ్వాలని పోరాడతారా అని ప్రత్యర్థులు ప్రశ్నిస్తున్నారు. కేంద్ర, రాష్ట్రాలు పనిగట్టుకుని ముస్లింలకు అన్యాయం చేస్తున్నాయని ఆయన మళ్లీ విషం కక్కారు.
ముస్లింలు తలుచుకుంటే మార్పు సాధ్యమని, ముస్లింలతోనే 50 ఎంపీ సీట్లు వస్తాయని, అలా ఏర్పడే ప్రభుత్వమే ముస్లిం సంక్షేమానికి పాటుపడుతుందని సెలవిచ్చారు. అక్బర్ మాటలకు పొలిటికల్ పండిట్స్ ఆశ్చర్యపోతున్నారు. ఇక అక్బర్ మారేది లేదని అంటున్నారు. మత ఛాందస భావాలు నరనరానా జీర్ణించుకుని, పైకి మాత్రం సిద్ధాంతాల తోలు కప్పుకుని తిరిగే ఎంఐఎం నుంచి ఇంతకంటే ఎక్కువ ఆశించడం మనదే తప్పు.
మరిన్ని వార్తలు