Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అక్కినేని ప్రిన్స్ అఖిల్ హీరోగా ఇప్పటి వరకు వచ్చిన రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డాయి. దాంతో మూడవ సినిమాపై ఎక్కువ శ్రద్దను కనబర్చుతున్నారు. మొదటి సినిమా పూర్తి స్థాయి మాస్ యాక్షన్ చిత్రంగా చేసిన అఖిల్ రెండవ సినిమాను ప్రేమ కథాంశంతో చేయడం జరిగింది. ఇప్పుడు మూడవ సినిమాను అఖిల్ భిన్న మైన ప్రేమకథతో క్లాస్ టచ్‌తో చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ‘తొలిప్రేమ’ చిత్రంతో వెంకీ అట్లూరి ఒక మంచి సక్సెస్‌ను దక్కించుకున్నాడు. ఆ దర్శకుడు ఇటీవల అఖిల్‌కు ఒక మంచి కథ చెప్పాడని, ఆ కథ అఖిల్ అండ్ కోకు నచ్చడంతో పాటు వెంటనే నటించేందుకు ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. ఆ విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు.
ఉగాది సందర్బంగా ఆ విషయాన్ని అధికారికంగా అక్కినేని ఫ్యామిలీ మెంబర్స్ ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ చర్చల దశలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే మరి కొందరు మాత్రం అఖిల్ మూడవ సినిమా ప్రకటన ఉగాది రోజు ఉంటుందని, అయితే అది వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఉంటుందా లేదా అనేది మాత్రం క్లారిటీ లేదు అంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఉగాది రోజు అక్కినేని ఫ్యాన్స్‌కు అఖిల్ ఏదో ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పడం ఖాయం. మరో వైపు నాగార్జున, నానిల మల్టీస్టారర్ చిత్రం ప్రారంభం అవ్వడంతో పాటు, నాగచైతన్య నటిస్తున్న సవ్యసాచి చిత్రం టీజర్‌ను కూడా ఉగాది రోజు విడుదల చేయబోతున్నారు. ముగ్గురు అక్కినేని హీరోలు ఉగాదిని ప్రత్యేకంగా జరుపుకునేందుకు సిద్దం అయ్యారు. అక్కినేని ఫ్యాన్స్‌కు ఇది చాలా ప్రత్యేకమైన ఉగాదిగా నిలిచే అవకాశం ఉంది.