నాగార్జున చిన్న కొడుకు అఖిల్ mr మజ్న్నుగా వచ్చేందుకు సిద్దం అవుతున్నాడు. ఈ చిత్రాన్ని వెంకి అట్లూరి రొమాంటిక్ ఎంటర్ టైనేర్ గా రూపొందిస్తున్నాడు. ఈ చిత్రం గురుంచి అఖిల్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. ఈ చిత్రం డిసెంబర్ 3 నాటికీ ఒక్క పాట మినహా షూటింగ్ పూర్తి అవ్వుతుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్యాచ్ వర్క్ జరుగుతుంది. జనవరి నాటికి సినిమాను విడుదల చేయ్యనున్నాము. ఇంత వరకు ఓపిగ్గా ఎదురుచూస్తున్నా అభిమానులకు ధన్యవాదాలు అంటూ పోస్ట్ చేశాడు. ఇటివల విడుదలయిన mr మజ్న్ను ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్సు వస్తున్నది.
దేవదాస్ మనవడో, మాన్మధుడు కి వారసుడో… అంటూ వచ్చే సాంగ్ ప్రేక్షకులను అలరించే విధంగా ఉంటుందని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఇప్పటి మోడరన్ స్టైల్ లో చెప్పి అందరి చేత శభాష్ అనిపించుకున్నాడు. ఈ చిత్రం పైన అక్కినేని అఖిల్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. జనవరి 25 న ఈ సినిమాను విడుదల చెయ్యాలి అని ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని బివీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నాడు. తమన్ ఈ చిత్రానికి సంగితంను అందిస్తున్నాడు. నాగ్ కూడా అఖిల్ కు సరైన హిట్ట్ ఇవ్వాలి అని సినిమా అవుట్ పుట్ ను ఎప్పుడకప్పుడు చెక్ చేస్తూ వస్తున్నాడట.