అలియా నిర్ణ‌యం స‌రైన‌దేనా..?

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

బాహుబ‌లితో జాతీయ స్థాయిలో క్రేజీ హీరో అయిపోయిన ప్ర‌భాస్ ప‌క్క‌న న‌టించాల‌ని భాష‌తో సంబంధం లేకుండా ఎంతోమంది హీరోయిన్లు క‌ల‌లు కంటున్నారు. అప్ క‌మింగ్ హీరోయిన్లు చాలామందికి ప్ర‌భాస్ తో ఓ సినిమా చేయ‌డం ల‌క్ష్యంగా మారింది. వాళ్లే కాదు…టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ సీనియ‌ర్ హీరోయిన్లు కూడా ప్ర‌భాస్ హీరోయిన్ గా న‌టించేందుకు ఎంతో ఆస‌క్తి చూపిస్తున్నారు. ఆ క్ర‌మంలోనే హిందీ హీరోయిన్ శ్ర‌ద్ధ‌క‌పూర్ కూడా సాహో అవ‌కాశాన్ని ద‌క్కించుకుంది.

Alia-Bhatt-Reportedly-rejec

ప్ర‌భాస్ ప‌క్క‌న కావ‌డం వ‌ల్లే ఆమె తెలుగు, హిందీ భాష‌ల్లో తెర‌కెక్కుతున్న ద్విభాషా చిత్రంలో న‌టించేందుకు అంగీక‌రించింది. కానీ బాలీవుడ్ లో శ్రద్ధ‌కు ప్ర‌ధాన పోటీదారు… అగ్ర హీరోయిన్ల‌లో ఒక‌రైన అలియా భ‌ట్ మాత్రం సాహోకు నో చెప్పిన విష‌యం ఆల‌స్యంగా వెలుగుచూసింది. ప్ర‌భాస్ ప‌క్క‌న సాహోలో తొలుత అలియాను హీరోయిన్ గా తీసుకోవాల‌ని చిత్ర యూనిట్ భావించింది. ఇందుకోసం అలియాకు స్క్రిప్ట్ కూడా వినిపించింది. అయితే మొత్తం స్క్రిప్ట్ విన్నాక అలియాకు హీరోయిన్ క్యారెక్ట‌ర్ ప‌రిధి త‌క్కువ‌గా ఉన్న‌ట్టు అనిపించి సినిమాకు నో చెప్పింద‌ని బాలీవుడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి.

 prabhas saaho movie

 

నిజానికి అలియా ఏ సినిమానైనా అంగీక‌రించే ముందు డైరెక్ట‌ర్ క‌ర‌ణ్ జోహార్ అభిప్రాయం తీసుకుంటుంది. ఆయ‌న్ను గాడ్ ఫాద‌ర్ గా భావిస్తుంటుంది. అలాగే సాహోకు కూడా క‌ర‌ణ్ అభిప్రాయం తీసుకుంటే…ఆయ‌న న‌టించ‌మ‌నే స‌ల‌హా ఇచ్చారని, కానీ అలియా మాత్రం చివ‌ర‌కి త‌న అభిప్రాయం ప్ర‌కార‌మే సాహో ఆఫ‌ర్ ను తిర‌స్క‌రించింద‌ని స‌మాచారం. దీంతో సాహో యూనిట్ శ్ర‌ద్ధ‌ను హీరోయిన్ గా ఎంపిక చేసుకుంది. సాహో కూడా బాహుబ‌లిలా బారీ విజ‌యాన్ని సాధిస్తుంద‌ని…త‌న నిర్ణ‌యంపై అలియా ప‌శ్చాత్తాపం ప‌డుతుంద‌ని ప్ర‌భాస్ అభిమానులంటున్నారు. యూవీ క్రియేష‌న్స్ తెర‌కెక్కిస్తున్న సాహో 2018లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Alia Bhatt rejected prabhas saaho movie