అల్లరి నరేష్ “బచ్చలమల్లి”గా తన పవర్ చూపించబోతున్నాడు..!

అల్లరి నరేష్ "బచ్చలమల్లి"గా తన పవర్ చూపించబోతున్నాడు..!
Cinema News

సినిమా పేరుని తన ఇంటి పేరుగా మార్చుకున్న నటుడు ‘అల్లరి’ నరేశ్. ‘అల్లరి’ ఫిల్మ్ తోనే తన సినీ కెరీర్ స్టార్ట్ కాగా, అలా కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా కొన్నాళ్ల పాటు అల్లరి నరేశ్ ఉండిపోయాడు . అలా సినిమా లు చేసుకుంటూ సక్సెస్ అందుకుని కొంత కాలం పాటు ముందుకెళ్లిన నరేశ్..ఒకానొక దశలో ఇక విజయం అనేది లేక సతమతమైపోయారు .

అల్లరి నరేష్ "బచ్చలమల్లి"గా తన పవర్ చూపించబోతున్నాడు..!
Allari Naresh

వరుస సినిమాలు బాక్సాఫీసు వద్ద అనుకున్న స్థాయిలో ఆడలేకపోతున్న క్రమంలో నరేశ్ తన పంథా మార్చుకున్నాడు . ఇక ఇప్పుడు హీరో అల్లరి నరేష్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. ఇప్పటికే “ఉగ్రం”, “ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం” సినిమాలతో హిట్స్ కొట్టారు. తాజాగా డైరెక్టర్ సుబ్బు మంగాదేవి దర్శకత్వంలో తెరకెక్కుతున్న #NARESH63 నుంచి అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమా టైటిల్ ను “బచ్చలమల్లి”గా ఫిక్స్ చేసినట్లు మేకర్స్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. విశాల్ చంద్రశేఖర్ ఈ సినిమా కి మ్యూజిక్ అందించనున్నారు.