Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అల్లు అర్జున్ ఇటీవలే ‘డీజే’ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద సందడి చేసిన విషయం తెల్సిందే. ‘డీజే’ సందడి పూర్తి కాకుండానే అల్లు అర్జున్ తన తర్వాత చిత్రం ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ చిత్రాన్ని మొదలు పెట్టేశాడు. ప్రముఖ రచయిత వక్కంతం వంశీ దర్శకత్వంలో ఆ సినిమా తెరకెక్కబోతుంది. భారీ స్థాయిలో అంచనాలున్న ఆ చిత్రం పూర్తిగా దేశ భక్తి నేపథ్యంలో ఉంటుందని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఇక ఈ స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా చిత్ర యూనిట్ సభ్యులు ప్రేక్షకులకు మరియు ఫ్యాన్స్‌కు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి.
దర్శకుడు వంశీ కూడా ఆ విషయాన్ని క్లారిటీగా చెప్పాడు. కాని నేడు అనుకున్నట్లుగా ‘నా పేరు సూర్య’ చిత్రం నుండి ఎలాంటి సర్ప్రైజ్ రాలేదు. ముందుగా ఈ చిత్రానికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన వీడియోను విడుదల చేయాలనుకున్నారు. కాని ఆ వీడియో విడుదలతో సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి తగ్గుతుందని, అందుకే వెనకడుగు వేసినట్లుగా తెలుస్తోంది. సినిమాకు సంబంధించిన ఎలాంటి విషయాలను ఇప్పుడు బయటకు చెప్పేందుకు దర్శకుడు ఆసక్తి చూపడం లేదు. అల్లు అర్జున్ కూడా అదే అభిప్రాయంతో ఉన్నాడు. అందుకే నేడు విడుదల కావాల్సిన సర్ప్రైజ్ను ఆపేశారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్‌కు జోడీగా అను ఎమాన్యూల్ హీరోయిన్గా నటిస్తుండగా, తమిళ స్టార్ శరత్ కుమార్ ముఖ్య పాత్రను పోషించబోతున్నారు. వచ్చే వేసవిలో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు.
మరిన్ని వార్తలు: