Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత కూతురి గురించి రోజుకో రకం వార్తలొస్తున్నాయి.జయ బతికి ఉన్నప్పుడు మౌనంగా ఉన్న ఆమె బంధువులు, స్నేహితులు ఇప్పుడు మాత్రం ఒక్కొక్కరుగా తమకు తెలిసిన వివరాలు వెల్లడిస్తున్నారు. ఇటీవలే జయ మేనత్త కూతురు లలిత…ఆమెకు కూతురు ఉందని ధృవీకరించారు. 1980లో చెన్నైలోని మైలాపూర్ లో తన పెద్దమ్మ జయకు పురుడుపోశారని, అయితే తనకు బిడ్డ పుట్టినట్టు ఎవరితో చెప్పవద్దని జయ ఆమెతో ఒట్టు వేయించుకున్నారని లలిత తెలిపారు. అయితే జయకు పుట్టిన ఆ కూతురు బెంగళూరుకు చెందిన అమృతేనా… కాదా అన్న విషయం మాత్రం తనకు తెలియదని లలిత పేర్కొన్నారు. తాజాగా జయ స్నేహితురాలు గీత కూడా ఈ విషయంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
బెంగళూరుకు చెందిన అమృత చెబుతున్న మాటలు నిజమేనని జయ స్నేహితురాలు గీత తెలిపారు. శోభన్ బాబు, జయలలితకు ఆమె జన్మించిందని, జయ సన్నిహితురాలు శశికళకు కూడా ఈ విషయం తెలుసని గీత అన్నారు. 1999లో తానోసారి శోభన్ బాబు ఇంటికి వెళ్లినప్పుడు జయలలితతో తనకో కుమార్తె ఉన్న విషయాన్ని ఆయన ప్రస్తావించారని, ఆమె పేరు అమృత అని చెప్పారని గీత గుర్తుచేసుకున్నారు. 1996 నుంచి అమృతకు జయలలితతో సంబంధాలు ఉండేవన్నారు. అమృత జయలలిత కూతురా..కాదా అన్న విషయం డీఎన్ ఏ పరీక్షల్లోనే తేలుతుందని అప్పటివరకు వేచిచూడాలని గీత తెలిపారు. రహస్యంగా కూతురిని కన్న జయలలిత..ఆ విషయాన్ని చివరిదాకా అంతే రహస్యంగా ఉంచారు.
శోభన్ బాబుతో పెళ్లి కాకుండా బిడ్డని కనడం, ఆయనకు అప్పటికే పెళ్లయి పిల్లలు ఉండడంతో… పుట్టిన బిడ్డకు ఇబ్బందికర పరిస్థితులు ఎదరుకాకూడదన్న ఉద్దేశంతో జయ, శోభన్ లు ఇద్దరూ ఆ విషయాన్ని రహస్యంగా ఉంచారు. అయితే పుట్టిన బిడ్డ సంరక్షణ బాధ్యతల్ని ఇద్దరిలో ఎవరు తీసుకున్నారు..ఆ బిడ్డ ఎక్కడ పెరిగింది అన్న వివరాలు అత్యంత సన్నిహితులకు తప్ప మరెవరికీ తెలియదు. జయ, శోభన్ బాబులకు కూతురు ఉందన్న విషయం వారిద్దిరి మరణానికి ముందు కూడా చాలామందికి తెలిసినప్పిటికీ..దాని గురించి ఎవరూ మాట్లాడేవారు కాదు. ఇప్పుడు తల్లిదండ్రులిద్దరూ మరణిచండంతో రహస్య కూతురి విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.