Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ప్రస్తుతం తెలుగు బుల్లి తెరపై సుమ తర్వాత అంతటి క్రేజ్‌ను దక్కించుకున్న యాంకర్ అనసూయ. ఈటీవీలో ప్రసారం అయ్యే జబర్దస్త్ కామెడీ షోతో తెలుగు బుల్లి తెరపై మెరుపు మెరిసిన అనసూయ ఆ మెరుపును అలాగే కొనసాగిస్తూ వస్తోంది. గత కొన్నాళ్లుగా అనసూయ ఏ షో చేసినా, ఏ సినిమా చేసినా కూడా మంచి పేరును దక్కించుకుంటుంది. ప్రస్తుతం పలు బుల్లి తెర రియాల్టీ షోలకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అనసూయ తాజాగా మోహన్‌బాబు, మంచు విష్ణులు ప్రధాన పాత్రల్లో నటించిన ‘గాయత్రి’ చిత్రంలో ఒక కీలక పాత్ర పోషించింది. ఆ సినిమా ఆడియో విడుదల వేడుక తాజాగా జరిగింది. ఆ కార్యక్రమంలో అనసూయ చాలా హాట్ కాస్ట్యూమ్స్‌తో కనిపించి అందరికి షాక్ ఇచ్చింది.
అదే సినిమాలో నటించిన శ్రియ పద్దతిగా ఒళ్లంతా కప్పుకుని ఉన్న డ్రస్‌తో కనిపించగా, అనసూయ మాత్రం చాలా హాట్‌గా, ఘాటు కాస్ట్యూమ్స్‌తో వచ్చింది. హీరోయిన్స్ పద్దతిగా వస్తున్న నేపథ్యంలో అనసూయ మాత్రం ఇలా హాట్ అందాలను ఆరబోస్తూ కనిపించడంతో కొందరు సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు. ఇటీవలే అనసూయ తన కాస్ట్యూమ్స్‌పై విమర్శలు చేస్తున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఒక పోస్ట్ పెట్టింది.
మళ్లీ కూడా అనసూయ డ్రస్‌పై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. తనకు స్వాతంత్య్రం ఉందని, తనకు ఏ డ్రస్ అయినా ధరించే హక్కు ఉందని అనసూయ భావించవచ్చు. కాని మనం హిందూ సాంప్రదాయంను పాటించాలి, ఇండియ పద్దతులు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కొందరు ఆమెను ఉద్దేశించి అంటున్నారు. మరి గాయత్రి వేడుకలో తన కాస్ట్యూమ్స్ పై వస్తున్న విమర్శలకు అనసూయ ఎలా స్పందిస్తుందో చూడాలి.