Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
Anchor Anasuya Reacts On Plastic Surgery Rumours
టాలీవుడ్ హాట్ యాంకర్ అనసూయ ఇద్దరు పిల్లలు కలిగినా ఏమాత్రం తగ్గకుండా అందాల ప్రదర్శణ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెల్సిందే. బుల్లి తెరపై తెగ ఆఫర్లతో రెచ్చి పోతున్న అనసూయ వెండి తెరపై అవకాశాల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూసినా కూడా ఛాన్స్ మాత్రం దక్కడం లేదు. అనసూయ ఒకటి రెండు చిత్రాల్లో మినహా పెద్దగా అవకాశాలు దక్కించుకోలేక పోయింది. ప్రస్తుతం చరణ్ మూవీలో ఒక ఛాన్స్‌ను ఈమె దక్కించుకున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఇక ఇదే సమయంలో అనసూయ తన నడుము భాగంలో ఉన్న కొవ్వును తగ్గించుకునేందుకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నట్లుగా వార్తలు వచ్చాయి.
రెండవ కాన్ను తర్వాత అనసూయ శరీరంలో చాలా మార్పులు వచ్చాయి. అయితే జిమ్‌కు వెళ్లి మునుపటి రూపంను తెచ్చుకున్న అనసూయ నడుము విషయంలో మాత్రం ఎన్ని వర్కౌట్లు చేసినా కూడా స్లిమ్‌గా కాలేదు. దాంతో అమెరికాలోని ప్రముఖ హాస్పిటల్లో ఈమె ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. మీడియాలో వస్తున్న వార్తలను అనసూయ కొట్టి పారేసింది. తనకు ఆపరేషన్ చేయించుకుని అందం పెంచుకోవాల్సిన అవసరం లేదని, తనకు మంచి పొజీషన్ ఉందని, మంచి ఆఫర్లు వస్తున్న తాను ఎందుకు లేనిపోని ప్రయోగాలు చేయాలనుకుంటాను అంటూ ఎదురు ప్రశ్నిస్తుంది. మీడియాలో వస్తున్న వార్తలు శుద్ద తప్పు అని ఆమె తేల్చి చెప్పింది.
మరిన్ని వార్తలు :