‘పెళ్లి చూపులు’ తర్వాత ప్రదీప్‌ పెళ్లి

pradeep Talks about her marriage

తెలుగు బుల్లి తెరపై ప్రదీప్‌ ప్రస్తుతం హవా సాగిస్తున్నాడు. ప్రదీప్‌ ఏ షో చేసినా కూడా ఆడియన్స్‌ ఫిదా అవుతున్నారు. ఇక యూత్‌లో ముఖ్యంగా అమ్మాయిల్లో ప్రదీప్‌పై ఏ స్థాయిలో క్రేజ్‌ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రదీప్‌కు సాదారణ అమ్మాయిల నుండి సెలబ్రెటీ అమ్మాయిల వరకు అంతా కూడా ఫ్యాన్స్‌ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి ప్రదీప్‌ను ఎంతో మంది అమ్మాయిలు డీప్‌గా లవ్‌ చేస్తున్నారు. ఆయన ఊ అంటే ఉరికి వెళ్లి పెళ్లి చేసుకునేందుకు సై అంటున్నారు. అలాంటి ప్రదీప్‌ పెళ్లి గురించి గత కొన్ని నెలలుగా తీవ్రంగా చర్చ జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ప్రదీప్‌ పెళ్లి గురించి మాట్లాడుతూ ఉన్నారు.

తన పెళ్లి గురించి మీడియాలో జరుగుతున్న ప్రచారంను ఉపయోగించుకుని ‘పెళ్లి చూపులు’ అనే రియాల్టీ షోను చేసేందుకు ప్రదీప్‌ సిద్దం అయ్యాడు. స్టార్‌ మాటీవీలో బిగ్‌బాస్‌ తర్వాత ప్రదీప్‌ పెళ్లి చూపులు షో ప్రసారం కాబోతుంది. తాజాగా ఈ షోకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. ప్రదీప్‌ను పెళ్లి చేసుకోవాలనుకునే వారు తమ వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఆడిషన్స్‌ నిర్వహించి కొందరిని ఎంపిక చేయబోతున్నారు. వారిలో షోను నిర్వహించి ఒకరిని ఫైనల్‌కు తీసుకు వెళ్లబోతున్నారు. ఫైనల్‌లో విజేత అయిన అమ్మాయిని ప్రదీప్‌ పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నాడు. ప్రదీప్‌ ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించాడు. పెళ్లి చూపులు షోతో ప్రదీప్‌ పెళ్లి అవుతుందని అంతా అంటున్నారు. మరి పెళ్లి చూపుల్లో ప్రదీప్‌కు నచ్చిన అమ్మాయి దొరకుతుందా అనేది చూడాలి.