Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ప్రకాశం టీడీపీ లో అంతర్గత కలహాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఒక్క అద్దంకి విషయంలోనే పాత నేతలు, పార్టీ మారి వచ్చిన మారి మధ్య విబేధాలు రచ్చకి ఎక్కాయి అనుకుంటే ఇప్పుడు ఇంకో ప్రాబ్లెమ్ బయటపడింది. గిద్దలూరు టీడీపీ లో ముసలం పుట్టింది. రాంబాంబు పేలింది.
2014 ఎన్నికల్లో దేశం అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన అన్నా రాంబాబు కి ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ఊహించని షాక్ ఇచ్చాడు. వైసీపీ నుంచి టీడీపీ లోకి దూకాడు. దీంతో అప్పటినుంచి రెండు వర్గాల మధ్య పరిస్థితి ఉప్పునిప్పులా మారింది. ఇద్దరి మధ్య సయోధ్య కోసం హైకమాండ్ చేసిన ప్రయత్నాలేమీ సక్సెస్ కాలేదు. కొన్నాళ్లుగా మౌనం పాటించిన రాంబాబు ఇక నియోజకవర్గాల పెంపు ఉండదని తేలిపోగానే ఇక టీడీపీ లో వుండలేనంటూ బాంబు పేల్చాడు. ఇంకో పార్టీలో చేరే ఉద్దేశం లేదంటూనే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని కూడా చెబుతున్నాడు. బాంబుల్లాంటి రాంబాబు కామెంట్స్ ఏమిటో మీరే చూడండి.
* మంత్రి పదవి ఇస్తామని చెప్పి నన్ను పార్టీలో చేర్చుకున్నారు.
* 2014 లో ఓడిపోయినా ధైర్యంగా పార్టీ కోసం పని చేశా
* అశోక్ రెడ్డి పార్టీలోకి వచ్చినప్పుడు స్వాగతించా
* అభివృద్ధి కోసం పార్టీలోకి వచ్చానని చెబుతున్న అశోక్ రెడ్డి ఆ అభివృద్ధిని అడ్డుకుంటున్నాడు.
* సాయి కల్పనా రెడ్డి ద్వారా పార్టీలో చేరా, వ్యాపారాలు వదులుకుని పార్టీ కోసం పనిచేస్తే ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యే నన్ను వ్యక్తిగతంగా దూషిస్తున్నాడు.
* అది నుంచి పార్టీని నమ్ముకుని వున్నవారికి అన్యాయం చేస్తున్న ఎమ్మెల్యేని హైకమాండ్ అడ్డుకోలేకపోయింది.
* ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం దేశంలోని ముఖ్యులందరినీ కలుస్తా
* తెలుగు దేశంలో కొనసాగడం ఇష్టం లేదు, ఏ పార్టీలో చేరడం లేదు.
* గిద్దలూరు నియోజకవర్గంలో మళ్లీ పోటీ చేస్తా.
మరిన్ని వార్తలు: