సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సమావేశమైన తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. నివేదికల ప్రకారం ఎస్పీ వర్గీకరణ ముసాయిదా బిల్లుకు ఆమోదం తెలిపింది. అలాగే.. మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ఇందిరమ్మ మహిళా శక్తి మిషన్ 2025 పాలసీ అమలుకు కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. అన్ని మహిళా సంఘాలను ఒకే గొడుగు కిందకు తెస్తామన్నారు మంత్రి పొంగులేటి. ప్రతీ రెవెన్యూ గ్రామానికి ఒక జీపీవో ను నియమించాలని కేబినెట్ నిర్ణయించింది.గతంలో వీఆర్వో,వీఏవోలుగా పనిచేసిన వారికి అవకాశం కల్పిస్తామన్నారు మంత్రి పొంగులేటి.




