జియో సినిమా యాప్‌లో జియో టెలికాం కంపెనీలో భాగమైనప్పటికే ప్రతి ఒక్కరూ ఉచితంగా ఐపిఎల్ క్రికెట్‌ను చూశారు. దీంతో యూజర్లు, డౌన్లోడ్ల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. అదొక్కటే కాదు ఫిఫా వరల్డ్ కప్ లైవ్ ఈవెంట్‌ను ఫ్రీగా స్ట్రీమింగ్ చూసి తమ యూజర్ల బేస్‌ను మరింత పెంచుకుంది. ఇప్పుడు ఈ రెండు ముగిసి పోవడంతో తమ యూజర్లను కోల్పోకుండా మరో కొత్త ఈవెంట్‌తో ముందుకొచ్చింది జియో సినిమా.
ఈ ఈవెంట్ ఆగస్టు 17వ తేదీ గురువారం నుంచి ప్రారంభం కానుంది. అక్టోబర్ 12వ తేదీ నుంచి అక్టోబర్ 14వ తేదీ వరకు ఫైనల్స్ జరగనున్నాయి. భారతదేశంలో తొలిసారి ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాటిల్ రాయల్ స్పోర్ట్స్ టోర్నమెంట్ ప్రత్యక్ష ప్రసారం కానుందని క్రాఫ్టన్ కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ-స్పోర్ట్స్ దేశంలోని అన్ని రకాల అభిమానులను కచ్చితంగా అలరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ పోటీల్లో 2 వేలకు పైగా జట్లు పాల్గొంటున్నాయి. రూ.75 లక్షల రూపాయలను గెలిచిన జట్టుకు అందజేస్తారు.
ఈ ఈవెంట్‌కు సంబంధించి CEO ,గేమ్ డెవలపర్ సీన్ హ్యునిల్ సోహ్న్ మాట్లాడుతూ, యుద్ధ భూమి మొబైల్ ఇండియా సిరీస్ ప్రారంభ మ్యాచులు ఆంగ్ల ,హిందీ భాషలలో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయని, జియో సినిమాతో కలిసి పని చేయడం తమకు ఎంతో ఆనందకరంగా ఉందని వెల్లడించారు. జియో సినిమాతో భాగస్వామి కావడం వల్ల యూజర్లకు అద్భుతమైన కంటెంట్, మరచిపోలేని మధురానుభూతులను అందించేందుకు ఇదే సరైన వేదిక అని తాము భావిస్తున్నట్లు తెలిపారు.
మన దేశంలో BGMI గేమ్ సంవత్సరం తర్వాత మళ్లీ తిరిగొచ్చింది. అయితే అనేక షరతులతో 2023లో మన దేశంలో ఈ గేమ్‌ను తిరిగి ప్రారంభించేందుకు క్రాఫ్టన్ కంపెనీకి కేంద్రం అనుమతి ఇచ్చింది. ఆ షరతులన్నింటికీ లోబడే క్రాఫ్టన్ తన గేమింగ్ సర్వీసును మన దేశంలో పునఃప్రారంభించింది. గతంలో కంటే ఈసారి ప్రైజ్ మనీని రెట్టింపు చేశారు.