Posted [relativedate] at-[relativetime time_format=”H:i”]
ఏముహూర్తాన ‘మణికర్ణిక’ ప్రారంభించారో కాని పాపం కంగనా రనౌత్‌కు వరుసగా గాయాలు అవుతూనే ఉన్నాయి. షూటింగ్ ముగింపు దశకు చేరుకుంటుండగా మరోసారి కంగనాకు గాయాలు అయ్యాయి. ఇప్పటికే రెండు సార్లు షూటింగ్ సందర్బంగా కంగనాకు ప్రమాదం జరిగిన విషయం తెల్సిందే. మొదటి సారి చిన్న గాయాలతో బయట పడ్డ ఆమె రెండవ సారి కాస్త సీరియస్‌గానే గాయాలపాలైంది. రెండవ సారి ప్రమాదం కారణంగా ఆమె మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. ఇక మూడవ సారి మరింత పెద్ద ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది.
తాజాగా ‘మణికర్ణిక’ చిత్రం షూటింగ్ జోద్‌పూర్‌లో జరుగుతుంది. ఈ సందర్బంగా గుర్రపు స్వారీకి సంబంధించిన సీన్స్‌ను చిత్రీకరిస్తున్నారు. ఆ సమయంలో కంగనా రనౌత్ గుర్రాన్ని ఎక్కేందుకు ప్రయత్నించి జారి పడినట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. దాంతో కుడికాళు మడత వద్ద ప్యాక్చర్ అయ్యిందని, కనీసం నాలుగు వారాలు అయినా విశ్రాంతి తీసుకోవాల్సిందిగా వైధ్యులు సూచించారు. మొత్తానికి కంగనా రనౌత్‌ను దర్శకుడు క్రిష్ చాలా కష్టపెడుతున్నాడు. కంగనా హీరోల మాదిరిగా స్టంట్స్ చేయబోతూ ఇలా గాయాల పాలవుతుంది. కాస్త సాహసాలను తగ్గించుకోవాలని ఆమెకు సన్నిహితులు సూచిస్తున్నారు.