రామ్ పోతినేని, నిధి అగర్వాల్, నభా నటేశ్ ప్రధాన పాత్రలలో పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన చిత్రం ఇస్మార్ట్ శంకర్. జూలై 18న విడుదల కానున్న ఈ చిత్రానికి సంబంధించి జోరుగా ప్రమోషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇటీవల ఓ ట్రైలర్ విడుదల చేసి భారీ అంచనాలు పెంచిన టీం తాజాగా మరో ట్రైలర్ రిలీజ్ చేసింది. రామ్ మేనరిజాన్ని .. తెలంగాణ యాసలో ఆయన డైలాగ్ డెలివరీని ఈ ట్రైలర్‌లో చూపించారు. ట్రైలర్స్‌ని బట్టి చూస్తుంటే ఈ సినిమా పక్కా మాస్ ఎంటర్‌టైనర్‌గా అలరించనున్నట్టు తెలుస్తుంది. మొన్నటి వరకు సాఫ్ట్‌గా ఉండే రామ్ ఒక్కసారిగా మాస్‌లుక్‌లోకి మారే సరికి అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రాన్ని టూరింగ్ టాకీస్, పూరి కనక్ట్ పతాకాలపై పూరి, ఛార్మి కలిసి సంయుక్తంగా నిర్మించారు.