Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు కలిసి ఒక మల్టీస్టారర్ చేయబోతున్నారు. ఈ విషయమై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. అలాగని ఈ వార్తను ఏ ఒక్కరు కొట్టి పారేయలేదు. అంటే మల్టీస్టారర్ చిత్రం నిజమే అని తేలిపోయింది. రాజమౌళి ‘బాహుబలి’ సినిమాను తెరకెక్కించే సమయంలో వారంలో ఒకటి రెండు పుకార్లు మీడియాలో షికార్లు చేసేవి. ఇప్పుడు రాజమౌళి ఆ ఫొటోను ఎప్పుడైతే పోస్ట్ చేశాడో అప్పటి నుండి రోజుకు రెండు మూడు పుకార్లు మీడియాలో షికార్లు చేస్తున్నాయి. అందులో నిజం ఎంతుందో, ఏది నిజమో, ఏది అబద్దమో తెలియకుండా ఉంది.
ఇక సోషల్ మీడియాలో తాజాగా జరుగుతున్న కొత్త ప్రచారం ప్రకారం ఈ మల్టీస్టారర్ మూవీలో ఒక హీరోయిన్గా అను ఎమాన్యూల్‌ను ఎంపిక చేశారట. రాజమౌళి స్వయంగా అను ఎమాన్యూల్‌తో మాట్లాడటంతో పాటు ఆమె పాత్రను కూడా బ్రీఫ్‌గా చెప్పినట్లుగా ప్రచారం జరుగుతుంది. అందుకే అను ఎమాన్యూల్ వెంటనే ఒప్పేసుకుందని, తన సన్నిహితుల వద్ద అను ఎమాన్యూల్ సంతోషంగా ఈ విషయాన్ని చెబుతుందని ప్రచారం జరుగుతుంది. మీడియాలో ప్రచారం అవుతున్న ఈ వార్త మరీ ఓవర్‌గా ఉందని కొందరు అంటున్నారు. రాజమౌళి సినిమా సెట్స్‌పైకి తీసుకు వెళ్లే ప్పుడు హీరోయిన్ విషయాన్ని ఆలోచిస్తాడు. అప్పటి వరకు హీరోయిన్ గురించి కాకుండా కేవలం స్క్రిప్ట్ గురించి మాత్రమే ఆలోచిస్తాడు అంటూ కొందరు అంటున్నారు. మరి ఏది నిజం ఏది అబద్దం అనే విషయం తెలియాలి అంటే జక్కన్న నోరు తెరవాల్సిందే.