సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మలయాళీ భామ ఫోటోలు

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మలయాళీ భామ ఫోటోలు

టాలీవుడ్ లో ఉన్న యువ హీరోయిన్స్ లో అనుపమ పరమేశ్వరన్ కూడా ఒకరు. యూత్ హీరో నితిన్ మరియు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ల కాంబోలో వచ్చిన “అఆ” సినిమాతో తెలుగు ఆడియెన్స్ కు పరిచయం అయ్యి యువతకు బాగా కనెక్ట్ అయ్యిపోయింది.

ఇప్పటి వరకు ఎలాంటి ఎక్స్ పోజింగ్ కూడా చెయ్యకుండా మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. అయితే తాజాగా అనుపమ మరియు ఆమె అభిమానులకు ఒక షాక్ తగిలింది. ఆమె సోషల్ మీడియా అకౌంట్ ను ఎవరో హ్యాక్ చేసారని దయచేసి దాని నుంచి వచ్చే పోస్టులు ఎవరు నమ్మవద్దని అను తన ఇతర సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తెలిపింది.

ఇదిలా ఉండగా ఆ హ్యాక్ అయ్యిన అకౌంట్ నుంచి అనుపమ మార్ఫింగ్ ఫోటోలు బయటకు రావడం సంచలనం రేపింది. మరీ వల్గర్ గా కాకుండా ఎవరెవరో ఫోటోలు అను ముఖ చిత్రాన్ని జోడించి సోషల్ మీడియాలో వదలగా అవి కాస్తా విపరీతంగా వైరల్ అయ్యిపోయాయి. దీనితో అనుపమ అభిమానులు తమ ఫాలోవర్స్ కు ఆ ఫేక్ ఫోటోలను ఎవరూ నమ్మొద్దని డిటైల్డ్ గా వివరించి విజ్ఞప్తి చేస్తున్నారు.వైరల్ అవుతున్న ఆ ఫోటోలు ఓసారి చూడండి.