Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
‘బాహుబలి 2’ విడుదలైన కొన్ని వారాల్లోనే అనుష్క హీరోయిన్గా పిల్లజమీందార్ ఫేం అశోక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘భాగమతి’ చిత్రాన్ని విడుదల చేస్తారనే ప్రచారం జరిగింది. ‘బాహుబలి 2’విడుదలై వారాలు కాదు, నెలలు గడుస్తున్నాయి. అయినా కూడా ఇంకా ‘భాగమతి’ వచ్చింది లేదు. భాగమతి చిత్రం ఎందుకు ఆలస్యం అవుతుంది అనే విషయంలో ఇప్పటి వరకు చిత్ర యూనిట్ సభ్యులు క్లారిటీ ఇవ్వలేదు. సినిమా ఎలా ఉండబోతుంది, సినిమా నేపథ్యం ఏంటి అసలు అనుష్కను ఎలా చూపిస్తున్నారు అనే విషయాలపై కూడా దర్శకుడు అశోక్ క్లారిటీ ఇవ్వలేదు. యూవీ క్రియేషన్స్ బ్యానర్లో తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలో విడుదల కాబోతుంది అంటూ ఆరు నెలలుగా ప్రచారం జరుగుతుంది. కాని విడుదలకు మాత్రం నోచుకోవడం లేదు.
ఎట్టకేలకు ఈ సినిమా ఆలస్యంకు కారణం ఏంటి అనే విషయంపై ఒక క్లారిటీ వచ్చింది. ‘భాగమతి’ చిత్రానికి ముందు అనుష్క సైజ్ జీరో అనే చిత్రాన్ని చేసిన విషయం తెల్సిందే. ఆ సినిమా కోసం అనుష్క దాదాపు 90 కేజీల బరువు పెరిగింది. ఆ సినిమా పూర్తి అయిన తర్వాత బరువు తగ్గేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. కాని బరువు మాత్రం తగ్గలేక పోతుంది. రెండు సంవత్సరాలుగా బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తున్నా కూడా ఆమెకు అది సాధ్యం కావడం లేదు. దాంతో అలాగే అధిక బరువుతోనే ‘భాగమతి’ చిత్రంలో నటించింది. ఆ చిత్రంలో అనుష్కను కాస్త సన్నగా నాజూకుగా చూపించేందుకు పెద్ద ఎత్తున గ్రాఫిక్స్‌ను వాడాలని నిర్ణయించారు. అనుష్క కనిపించిన ప్రతి షాట్లో కూడా గ్రాఫిక్స్‌ను వాడి ఆమెను 50 కేజీల లోపులో చూపించాలని నిర్ణయించారు. అందుకోసం దాదాపు 5 కోట్లను నిర్మాతలు అధనంగా ఖర్చు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ గ్రాఫిక్స్ కారణంగానే సినిమా ఆలస్యం అవుతుందనే ప్రచారం జరుగుతంది. ఈ సంవత్సరం చివర్లో లేదా వచ్చే వేసవిలో సినిమాను విడుదల చేస్తారేమో చూడాలి.